పర్యావరణ హితంగా పండుగ చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ హితంగా పండుగ చేసుకోవాలి

Jul 24 2026 1:09 AM | Updated on Jul 24 2026 1:09 AM

నంద్యాల(వ్యవసాయం): వినాయక చవితి పండుగను పర్యావరణ హితమైన పండుగగా చేసుకోవాలని రాష్ట్ర గణేష్‌ మహోత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్‌ అన్నారు. జిల్లా గణేష్‌ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో గురువారం జిల్లాలో ని అన్ని మండలాలలో ఉన్న వినాయక చవితి కమిటీ నాయకులు, కార్యకర్తలతో జిల్లా స్థాయి విస్తృత సమావేశం రామకృష్ణ పీజీ కళాశాలలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పాకాల త్రినాథ్‌ మాట్లాడు తూ పండుగను ముందస్తు ప్రణాళికలతో ఎటువంటి సమస్యలు, ప్రమాదాలు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. రాష్ట్ర గణేష్‌ మహోత్సవ కమిటీ ఉపాధ్యాక్షులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వినాయక మండప నిర్వాహకులు మట్టి (సహజ) వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించాలన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలకు దూరంగా ఉండాలన్నారు. విగ్రహాల నిమజ్జనం ప్రభుత్వ అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే నిర్వహించాలని, చెరువులు, కాలువలు కాలుష్యం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గణేష్‌ సమితి నిర్వాహక సభ్యుడు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి విజయకుమార్‌, విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర విష్ణువర్ధన్‌ రెడ్డి, సందీప్‌, మేడ మురళీ, నర్ల మహేశ్వరరెడ్డి, సత్యం, శంకర్‌, సుహాసిని, ఇందిరా, నాగిరెడ్డి, హుస్సేన్‌ రెడ్డిలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement