రక్తపింజరిని పట్టుకున్న రెస్క్యూ టీం | - | Sakshi
Sakshi News home page

రక్తపింజరిని పట్టుకున్న రెస్క్యూ టీం

Jul 23 2026 1:48 AM | Updated on Jul 23 2026 1:48 AM

పాములపాడు: స్థానిక పోస్టాఫీసు ఎదురుగా ఒక గోడలో విషపూరిత రక్తపింజరి పామును ఫారెస్టు రెస్క్యూ టీం పట్టుకున్నారు. ఈ నెల 21న రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో పాము రోడ్డు దా టుతుండటాన్ని గమనించిన ఓ మహిళ అక్కడు న్న యువకులకు చెప్పింది. గోడలో నక్కి ఉన్న ఆ సర్పాన్ని చూసి కొండచిలువగా భావించిన యు వకులు వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌, ఫారెస్టు అధికారులకు ఫోన్‌ చేసి సమాచారంఅందించా రు. రెస్క్యూ టీం సభ్యులు వచ్చి పరిశీలించి రక్తపింజరి పాముగా గుర్తించారు. స్నేక్‌క్యాచర్‌ చాకచక్యంగా పామును బంధించారు. అనంతరం హ నుమాన్‌ వైల్డ్‌ లైఫ్‌ రెస్క్యూ టీం సభ్యులు జాకీర్‌హుస్సేన్‌, ఎఫ్‌ఎస్‌ఓ సాయిపీరా మాట్లాడుతూ.. ఈ పాము విషపూరితమైనదని, కుక్కర్‌ విజిల్‌లాగా శబ్దం చేస్తుందని చెప్పారు. మనిషి ఉన్న దూరాన్ని అంచనా వేసిదాడి చేయగల సామర్ధ్యం దాని సొంతమన్నారు. హనుమాన్‌ యాప్‌ను డౌన్‌లోడు చేసుకొని విషసర్పాలు ఎక్కడున్నా సమాచారం అందిస్తే క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని పాములను పట్టుకొని అడవిలో వదులుతామని చెప్పారు. స్నేక్‌ క్యాచర్‌ కాళీచరణ్‌, వీఏ ఖలీల్‌, సీబీఈటీ ఇస్మాయిల్‌ ఉన్నారు.

బైక్‌ అదుపుతప్పి వ్యక్తి మృతి

కర్నూలు: కల్లూరు మండలం మహమ్మద్‌ నగర్‌లో నివాసముంటున్న ఖాజా (40) బైక్‌ అదుపుతప్పి కింద పడటంతో తీవ్రగాయాలపాలై అర్ధరాత్రి మృతిచెందాడు. ఈయన కల్లూరు ఎస్టేట్‌ లోని ఎంఎస్‌ రాయల్‌ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ లో 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వస్తూ గుత్తి పెట్రోల్‌ బంకు సమీపంలో బైక్‌ అదుపుతప్పి కింద పడి గాయాలపాలయ్యాడు. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో నొప్పులు తీవ్రం కావడంతో భార్య హసీనా ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదవశాత్తు బైక్‌ పైనుంచి కింద పడటం వల్లే తలకు, ఛాతీకి గాయాలై చనిపోయాడని భార్య హసీనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఐటీఐ కోర్సులకు

దరఖాస్తుల ఆహ్వానం

శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని ప్రభుత్వ ఐటీఐలో రెండవ విడత అడ్మిషన్ల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ రవీంద్రబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 3వ తేదీ ఆఖరు కాగా ఆన్‌లైన్‌లో admissio ns.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చన్నారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ ఐటీఐ వారిని నేరుగా సంప్రదించవచ్చన్నారు. ఫిట్టర్‌, టర్నర్‌, ఎలక్ట్రీషియన్‌, డ్రాఫ్ట్‌మెన్‌ సివిల్‌, ఒక సంవత్సరం కోర్సులు డీజిల్‌ మెకానిక్‌, వెల్డర్‌, కంప్యూటర్‌ కోర్స్‌ ట్రేడ్లలో ఖాళీలు ఉన్నాయని తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని వెల్డర్‌ ట్రేడ్‌ కోర్సులో చేరేందుకు పదో తరగతి ఫెయిలైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమకు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ వారిని సంప్రదించి ఆగస్టు 4వ తేదీలోపు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేయించుకోవాలన్నారు. రెండో విడత అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ ఆగస్టు 6వ తేదీ జరుగుతుందని, అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో శ్రీశైలం ప్రభుత్వ ఐటీఐలో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు శ్రీశైలం ఐటీడీఏ (94932 52324, 94411 81072) ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చన్నారు.

వేతన సవరణలో

జాప్యం తగదు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఆంధ్రప్రదేశ్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంకర్స్‌ అసోసియేషన్‌ చొరవ తీసుకొని దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీనియర్‌ అధికారుల వేతన సవరణ చేపట్టాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఏపీసీసీబీ ఆఫీసర్స్‌ అసోషియేషన్‌ నేతలు డిమాండ్‌ చేశారు. బుధవారం డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. వెంటనే వేతన సవరణ చేపట్టాలని నినాదాలు చేశారు. సీనియర్‌ అధికారులు చేపట్టన ఆందోళన కార్యక్రమాలకు డీసీసీబీలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. ఆఫీసర్స్‌ అసోషియేషన్‌ నేత సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధనకు ఈ నెల 27న సా మూహిక సెలవు పెట్టి ఆందోళన చేపట్టనున్నట్లు వివరించారు. అలాగే 31న చలో విజయవాడ చేపట్టి, అ క్కడ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement