క్వాంటం టెక్నాలజీతో వేగంగా సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

క్వాంటం టెక్నాలజీతో వేగంగా సమస్యల పరిష్కారం

Mar 7 2026 7:27 AM | Updated on Mar 7 2026 7:27 AM

కర్నూలు సిటీ: క్వాంటం టెక్నాలజీ అత్యంత వేగంగా సమస్యలను పరిష్కారం చేస్తుందని ప్రొఫెసర్లు అన్నారు. జగన్నాథగట్టులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌(ట్రిబుల్‌ఐటీడీఎం)లో క్వాంటం మెటీరియల్స్‌ ఫండమెంటల్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ అనే అంశంపై శుక్రవారం వర్క్‌షాపు ప్రారంభం అయ్యింది. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వర్క్‌షాపును ట్రిబుల్‌ఐటీడీఎం రిజిస్ట్రార్‌ జె.క్రిష్ణయ్య, ఆన్‌లైన్‌లో ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్‌ బి.కోటేశ్వరరావులు ప్రారంభించి ప్రసంగించారు. క్వాంటం టెక్నాలజీ డేటాను అత్యంత వేగంగా విశ్లేషణ చేస్తుందన్నారు. అనంతరం వర్క్‌షాపు కో–ఆర్డినేటర్‌ డా.పవన్‌ ప్రకాష్‌ మాధురీ మాట్లాడారు. ట్రిబుల్‌ఐటీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కర్నూలు(సెంట్రల్‌): హెచ్‌పీవీ(హ్యూమన్‌ పాపిల్లో మావైరస్‌) వ్యాక్సినేషన్‌తో ప్రాణాంతక సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణకు అవకాశం ఉంటుందని, 14–15 ఏళ్ల మధ్య ఉన్న బాలికలకు ఈ వ్యాక్సిన్‌ను కచ్చితంగా వేయించాలని తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కోసం ముద్రించిన పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..14 ఏళ్లు నిండి 15వ ఏట అడుగుపెట్ట బాలికలందరికీ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయాలన్నారు. గార్డాసిల్‌–4వ్యాక్సిన్‌ను 0.5ఎంఎల్‌ మోతాదులో ఎడమ చేతికివేస్తారని, వయసు నిర్ధారణ కోసం ఆధార్‌ కార్డు, తల్లిదండ్రుల నుంచి సమ్మతిపత్రం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. యూవీన్‌ పోర్టల్‌ ద్వారా లేదా స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. టీకా వేయించుకోవడానికి వచ్చే వారుతప్పనిసరిగా ఆహారం తిని రావాలని, టీకా తీసుకున్న తరువాత 30 నిమిషాలపాటు ఆరోగ్య కేంద్రంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్నారు. జిల్లాలో మొత్తం 19,704 వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయని, అన్ని పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భాస్కరరాజు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చిట్టి నరసమ్మ, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ జఫ్రూల్లా పాల్గొన్నారు.

పోస్టర్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి, వైద్యాధికారులు

అక్రమ మైనింగ్‌ను కట్టడి చేయాలి

జిల్లాలో అక్రమ మైనింగ్‌ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మైనింగ్‌ అధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఆమె మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖకు సంబంధించిన జిల్లా స్థాయి టాస్క్‌ ఫోర్సు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలో ఎక్కడైనా అక్రమ మైనింగ్‌ జరుగుతుంటే వెంటనే రెవెన్యూ, మైనింగ్‌, అటవీ, పోలీసులు శాఖలు సమన్వయంతో పని చేసి మూయించివేయాలన్నారు. మైనింగ్‌ అనుమతుల మంజూరులో పారదర్శకతను పాటించాలని నిబంధనలకు అనుగుణంగా లేకపోతే తిరస్కరించాలన్నారు. సమావేశంలో మైన్స్‌అండ్‌ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్‌ జి.వెంకటేశ్వర్లు, అటవీశాఖ అధికారి తేజస్వి, తహసీల్దార్‌ వెంకటలక్ష్మీ, హుస్సేన్‌సాహెబ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement