గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి 8న ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి 8న ప్రవేశ పరీక్ష

Mar 7 2026 7:27 AM | Updated on Mar 7 2026 7:27 AM

కర్నూలు(అర్బన్‌): ఉమ్మడి జిల్లాలోని డా.బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 8న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ ఎంఈ గీత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ –2 పరీక్షలు నిర్వహించబడుతున్న నేపథ్యంలో ఈ నెల 2వ తేదీన నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షను 8వ తేదీకి మార్పు చేస్తామని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనం కోసమే ఈ మార్పును చేశామని, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరు కొత్త తేదీన నిర్వహించే పరీక్షకు హాజరు కావాలన్నారు.

శిశుగృహకు చేరిన మగబిడ్డ

కర్నూలు(అర్బన్‌): ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో వదలి వెళ్లిన మూడు రోజుల మగ శిశువు (వీవాన్‌)ను బాలల సంక్షేమ సమితి ఉత్తర్వుల మేరకు ప్రత్యేక దత్తత సంస్థ ( శిశు గృహ)లో ఉంచి సంరక్షిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిణి పీ విజయ తెలిపారు. హాస్పిటల్‌లోని పీడియాడ్రిక్‌ బ్లాక్‌లో గుర్తు తెలియని మహిళ వాష్‌ రూమ్‌కు వెళ్లివస్తానని చెప్పి మూడు రోజుల మగశిశువును అటెండర్‌ చేతిలో ఉంచి తిరిగి రాలేదని, పరిసరాల్లో గాలించినా మహిళ ఆచూకీ లభ్యం కాలేదన్నారు. గత నెల 14వ తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ వరకు ఆసుపత్రిలోనే ఉంచి ట్రీట్‌మెంట్‌ ఇచ్చి డిశ్చార్జ్‌ చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే తమకు అప్పగించిన మగ శిశువును శిశు గృహలో ఉంచామన్నారు. సాక్ష్యాధారాలతో జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ, సంబంధీకులు గాని 30 రోజుల్లోగా తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. లేని పక్షంలో ఈ శిశువును ‘కారా’ న్యూఢిల్లీ దత్తత నిబంధనల ప్రకారం దత్తత ఇస్తామని శుక్రవారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

దేహదారుఢ్య పరీక్షలు

కర్నూలు: ఇటీవల విడుదలైన గ్రూప్‌–2 పరీక్ష ఫలితాల్లో ఎకై ్సజ్‌ శాఖ జోన్‌–4 (కర్నూలు జోన్‌) కింద ఎంపికై న 42 మంది అభ్యర్థులకు గాను శుక్రవారం 20 మంది అభ్యర్థులకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ కర్నూలు నోడల్‌ డిప్యూటీ కమిషనర్‌ పి.శ్రీదేవి, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌.హనుమంతరావు ఆధ్వర్యంలో ఆరోగ్య, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. స్థానిక డీసీ కార్యాలయంలో 20 మంది అభ్యర్థులకు రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ జావేద్‌ బృందం నేతృత్వంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మిగిలిన 22 మంది అభ్యర్థులకు శనివారం దేహదారుఢ్య, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఏఈఎస్‌లు రాజశేఖర్‌ గౌడ్‌, రామకృష్ణా రెడ్డి, సీఐలు చంద్రహాస్‌, రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైలం నుంచి 27,094 క్యూసెక్కుల నీటి విడుదల

శ్రీశైలంప్రాజెక్ట్‌: శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 27,094 క్యూసెక్కుల నీరు విడుదలయ్యింది. విద్యుత్‌ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 20,140 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. బ్యాక్‌ వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 800 క్యూసెక్కులు, మల్యాల ఎత్తిపోతలకు 335 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,678 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement