చెప్పేదెవరు! | - | Sakshi
Sakshi News home page

చెప్పేదెవరు!

Feb 25 2026 9:41 AM | Updated on Feb 25 2026 9:41 AM

చెప్ప

చెప్పేదెవరు!

ర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఓపీ రోగులకు మందులిచ్చే ఔషధశాల మార్పు గందరగోళానికి తెరతీసింది. రెండేళ్ల క్రితం ఆసుపత్రిలోని ఓపీ విభాగం వద్ద మందులు ఇచ్చేవారు. రోగుల సంఖ్య ఎక్కువ కావడంతో అక్కడ నుంచి కొత్త ఎంసీహెచ్‌ భవనం వద్ద ఉన్న షెడ్డులోకి దీనిని మార్చారు. అయితే, వేసవి కాలంలో ఇక్కడ మందులిచ్చే సిబ్బందితో పాటు రోగులు ఈ రేకుల షెడ్డులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకు అనుగుణంగా చల్లదనాన్ని ఇచ్చేలా అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. ఈ మేరకు గత మూడు రోజుల నుంచి ఔషధ శాలను ఆసుపత్రిలోని పాత సెంట్రల్‌ ల్యాబ్‌ భవనంలోకి మార్చారు. ఆ విషయాన్ని రేకుల షెడ్డు వద్ద చెప్పే సూచన బోర్డు లేకపోవడంతో అక్కడికి మందుల కోసం వచ్చిన రోగులు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. కొందరు మాత్రం తెలుసుకుని సెంట్రల్‌ ల్యాబ్‌ భవనం వద్దకు వెళ్లి మందులు తీసుకుంటున్నారు.

– కర్నూలు(హాస్పిటల్‌)

చెప్పేదెవరు!1
1/1

చెప్పేదెవరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement