ఇద్దరికి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి
కర్నూలు(సెంట్రల్): ఉమ్మడి జిల్లాలో తహసీల్దార్ హోదాలో పనిచేస్తున్న ఇద్దరికీ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించింది. కర్నూలు కలెక్టరేట్ ఏఓగా పనిచేస్తున్న ఆర్.శివరాముడు, పాణ్యం తహసీల్దార్‌గా పనిచేస్తున్న వై.నరేంద్రనాథ్‌రెడ్డిలకు పదోన్నతి ఇచ్చి పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీఓఆర్టీ నంబర్ 471ని విడుదల చేసింది. కాగా, ఆర్.శివరాముడును తెలుగుగంగ ప్రాజెక్టు యూనిట్–3 ఎస్‌డీసీగా, బనగానపల్లె ఆర్‌డీఓగా వై.నరేంద్రనాథ్‌రెడ్డిని నియమించారు.
ఐదుగురిపై పోక్సో కేసు నమోదు
ఆలూరు రూరల్: మండల పరిధిలోని అరికెర అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం రాత్రి 8వ తరగతి చదువుతున్న విద్యార్థిపై లైంగిక దాడి చేసిన ఘటనలో ఐదుగురిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ రవి శంకర్ రెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. తన కుమారుడిపై అదే పాఠశాలకు చెందిన విద్యార్థులు లైంగికంగా దాడి చేశారని బాధితుడి తండ్రి సోమ వారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితులపై కేసు నమోదైంది.
బాలికల్లో పోటీతత్వం పెరగాలి
వెల్దుర్తి: సమాజంలో ఉన్నతంగా రాణించేందుకు బాలికల్లో పోటీతత్వం పెరగాలని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఇషితా గంగూలీ త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. సుధాకర్, సమగ్రశిక్ష జిల్లా అధికారి ఎన్. లోకరాజు, రాష్ట్ర ప్రభుత్వ అబ్జర్వర్ జయలక్ష్మి, జిల్లా జీసీడీఓ మేరి స్నేహలతతో కలిసి స్థానిక పీఎంశ్రీ బాలికల జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. పాఠశాలలో విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. సైన్స్‌ల్యాబ్‌లో విద్యార్థినులు చేసిన ప్రయోగాలను పరిశీలించి అభినందించారు. విద్యార్థినులతో మాట్లాడి కంప్యూటర్స్, గ్రంథాలయం, సాంకేతిక విద్య, క్రీడలపై ఆసక్తిని తెలుసుకున్నారు.
27న మహానంది ఆలయ హుండీ లెక్కింపు
మహానంది: మహానంది దేవస్థానంలో ఈనెల 27వ తేదీన హుండీ కానుకల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శ్రీ కామేశ్వరీ దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారితో పాటు ఆంజనేయస్వామి, కోదండ రామాలయం, అన్నప్రసాద విభాగం గో సంరక్షణ విభాగాల్లోని హుండీ కానుకల లెక్కింపు ఉంటుందన్నారు. సిబ్బంది అందరూ హాజరుకావాలని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
మంత్రాలయం రూరల్: మండల కేంద్రం మంత్రాలయంలోని అయ్యప్పస్వామి గుడి దగ్గర ఆటోను కారు ఢీకొంది. ఈ సంఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. మంత్రాలయం ఎస్‌ఐ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం ఉదయం రాయచూరు జిల్లా ఎరిగేరికే చెందిన కారు మంత్రాలయం వైపు వేగంగా వస్తూ అయ్యప్పస్వామి గుడి సమీపంలో ముందు వెళ్తు న్న ఆటోను వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటన లో ఆటో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న వలిసాబ్, బోయ నర్సప్ప, కురువ తిక్కన్న, డ్రైవర్ రాజు అనే నలుగురికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తము 108 అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు వలిసాబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వాలీబాల్ పోటీల విజేత చాగలమర్రి జట్టు
నంద్యాల(అర్బన్): పాండురంగాపురంలో రెండు రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీల్లో విజేతగా చాగలమర్రి జట్టు నిలిచింది. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ పోటీల్లో 14 టీంలు పాల్గొన్నాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో బనగానపల్లె జట్టుపై చాగలమర్రి జట్టు 7 పాయింట్లతో గెలిచి ప్రథమ బహుమతి సాధించింది. బనగానపల్లె జట్టు ద్వితీయ బహుమతిని సాధించగా నంద్యాల జట్టు తృతీయ బహుమతి అందుకుంది. మొదటి బహుమతి కింద చాగలమర్రి జట్టుకు రూ.20 వేలు నగదు పురస్కారాన్ని వైఎస్సార్‌సీపీ నేత సారథిరెడ్డి వంగా అందించారు. అదే విధంగా రెండో బహుమతి కింద బనగానపల్లె జట్టుకు రూ.10వేలు, మూడో బహుమతి కింద నంద్యాల జట్టుకు రూ.5 వేలు అందించారు.
ఇద్దరికి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి


