దోపిడీ కేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

దోపిడీ కేసులో నిందితుడి అరెస్టు

Feb 25 2026 9:41 AM | Updated on Feb 25 2026 9:41 AM

దోపిడీ కేసులో నిందితుడి అరెస్టు

దోపిడీ కేసులో నిందితుడి అరెస్టు

కర్నూలు: కర్నూలు పాతబస్తీలో నివాసముండే షేక్‌ ఖలీల్‌ బాషాను బెదిరించి మోటార్‌ బైక్‌, సెల్‌ఫోన్‌ లాక్కున్న కేసులో బంగారుపేటకు చెందిన నిందితుడు గిడ్డయ్యను రిలయన్స్‌ మార్ట్‌ వద్ద నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. ఖలీల్‌ బాషా ఈనెల 7న సంపత్‌ నగర్‌లోని తన కార్పెంటర్‌ షాపులో పని ముగించుకుని రాత్రి గడ్డా వీధిలోని ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఐరా హాస్పిటల్‌ నుంచి పాత ఈద్గా వైపు వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మోటార్‌ సైకిల్‌కు అడ్డంగా వచ్చి డబ్బులు అడిగి ఇవ్వనందుకు కొట్టి అతని వద్ద ఉన్న స్మార్ట్‌ ఫోన్‌, మోటార్‌ సైకిల్‌ను లాక్కెళ్లాడు. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా నిందితుడు గిడ్డయ్య కోడుమూరు రోడ్డులోని రిలయన్స్‌ మార్ట్‌ వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి మోటార్‌ సైకిల్‌తో పాటు స్మార్ట్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు సీఐ విక్రమ సింహా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement