సాంకేతిక అంశాలపై సదస్సు
కర్నూలు(సెంట్రల్): ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ తయారీలో అబ్రేసివ్ ఫ్లో మిషనింగ్ అత్యంత కీలకంగా పని చేస్తుందని, ఉపరితల నాణ్యత, కచ్చితత్వం, జీవ అనుకూలత మెరుగుపడతాయని వరంగల్ ఎన్‌ఐటీ ప్రొఫెసర్ జి.వెంకటేష్ అన్నారు. మంగళవారం ఆర్‌యూలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ పి.వెంకట సుందరానంద్ అధ్యక్షతన ఆధునిక తయారీ, సాంకేతికల్లో అబ్రేసివ్ ఫ్లో మిషనింగ్ ప్రాముఖ్యతపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సునకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉపన్యాసం చేశారు. సాంకేతిక వైద్య రంగంలో ముఖ్యంగా మోకాలి ఇంప్లాంట్స్ తయారీలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని వివరించారు. సమన్వనయకర్త ఏ.శ్రీకాంత్ మట్లాడుతూ.. విద్యార్థులు పరిశోధన దృక్పథంతో ఆధునిక తయారీ విధానాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అధ్యాపకులు బీవీ శివప్రసాద్‌రెడ్డి, టి.గాయత్రి, జి.నాగరాజు, ఏ.సర్వేశ్వర్ ఆపల్గొన్నారు.


