లోక్ అదాలత్‌ను విజయవంతం చేద్దాం
ఆళ్లగడ్డ: మార్చి 14వ తేదీన నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సమష్టిగా విజయవంతం చేద్దామని సీనియర్, జూనియర్ సివిల్ జడ్జీలు శైలజ, భాస్కర్ అన్నారు. స్థానిక బార్ అసోసియేషన్ సభ్యు లు, బ్యాంక్‌ల అధికారులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించడమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సివి ల్, రాజీపడదగిన క్రిమినల్ కేసులతోపాటు వాహన ప్రమాదం, చెక్‌బౌన్స్, కుటుంబ తగాదాల వంటి వివిధ రకాల కేసులను పరిష్కరించుకోవచ్చని ఇరువర్గాల కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. న్యాయవాదులు ఈ విషయంలో చొరవ చూపితే కేసులను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందన్నారు.


