‘సూపర్‌సిక్స్‌’ అట్టర్‌ ఫ్లాప్‌ | - | Sakshi
Sakshi News home page

‘సూపర్‌సిక్స్‌’ అట్టర్‌ ఫ్లాప్‌

Feb 26 2026 8:37 AM | Updated on Feb 26 2026 8:37 AM

‘సూపర్‌సిక్స్‌’ అట్టర్‌ ఫ్లాప్‌

‘సూపర్‌సిక్స్‌’ అట్టర్‌ ఫ్లాప్‌

హొళగుంద: టీడీపీ అధినేతగా చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ‘సూపర్‌సిక్స్‌’ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి అన్నారు. రెండేళ్లయినా కొత్త పింఛన్‌, రేషన్‌ కార్డులు లేవని, ఖర్చులేని ప్రచారాలు తప్ప చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసింది సున్నా అన్నారు. హొళగుందలో జరిగిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు.. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద రూ.1,500, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్‌.. ఇలా అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా కొన్ని అరకొర చేసి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. టీడీపీ నేతలు చేసిన మోసం అందరికీ అర్థమయ్యిందన్నారు.

అర్ధరాత్రి వరకు ఓట్లేస్తారా?

ఎక్కడైనా రాత్రి 8 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అర్ధరాత్రి 2 గంటల వరకు ఓటింగ్‌ జరిగిందని ఎన్నికల కమిషన్‌ చెప్పడంపై చూస్తే వాస్తవం ఏమిటో అర్థం అవుతోందన్నారు. గత ఎన్నికలో వైఎస్సార్‌సీపీదే విజయమని, ఆరా మస్తాన్‌ చెప్పిందే నిజమని ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. గత ఎన్నికల్లో ట్యాంపరింగ్‌, ఓట్ల చోరీ జరిగిందని, లేని పక్షంలో వైఎస్సార్‌సీపీ గెలిచి అధికారంలో ఉండేదన్నారు.

‘స్థానిక’ ఎన్నికల్లో అన్ని స్థానాలు

వైఎస్సార్‌సీపీవే..

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపే గెలుస్తుందని ఎమ్మెల్యే విరూపాక్షి ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు నాయకులు, కార్యకర్త కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రానికి మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ఆలూరు నియోజకవర్గంలో రోడ్లు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. సమావేశం అనంతరం కోగిలతోట గ్రామంలో అనారోగ్యంతో మృతిచెందిన గ్రామపెద్ద గో పాల్‌రెడ్డి తల్లి రంగమ్మ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ షఫీవుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు గిరి, నాయకు లు ఈశా, కోగిలతోట శేషప్ప, హెబ్బటం శ్రీనివాసరెడ్డి, కాకి ఫక్కీరప్ప, కన్నయ్య, ఎంపీటీసీ సభ్యు లు శివన్న, షేక్షావలి, మల్లయ్య, మౌనేష్‌, రవి, కృష్ణయ్య, వెంకటేష్‌, శేఖర్‌, రఫీక్‌ పాల్గొన్నారు.

ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం

చేసింది సున్నా

‘స్థానిక’ ఎన్నికల్లో

వైఎస్సార్‌సీపీ సత్తా చాటుదాం

ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement