ఇతని పేరు పాల మద్దయ్య. కర్నూలు మండలం చిన్నటేకూరు గ్రామం. వయస్సు 63 ఏళ్లు. ఒక కుమార్తె సంతానం కాగా సున్నిపెంటలో ఉంటోంది. పింఛను కోసం పదుల సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేకపోయింది. పూట గడవక రెండేళ్లుగా కలెక్టరేట్‌ ముఖద్వారం వద్ద కూర్చొని అడుక్కుంటున్నాడు | - | Sakshi
Sakshi News home page

ఇతని పేరు పాల మద్దయ్య. కర్నూలు మండలం చిన్నటేకూరు గ్రామం. వయస్సు 63 ఏళ్లు. ఒక కుమార్తె సంతానం కాగా సున్నిపెంటలో ఉంటోంది. పింఛను కోసం పదుల సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేకపోయింది. పూట గడవక రెండేళ్లుగా కలెక్టరేట్‌ ముఖద్వారం వద్ద కూర్చొని అడుక్కుంటున్నాడు

Feb 26 2026 8:37 AM | Updated on Feb 26 2026 8:37 AM

ఇతని

ఇతని పేరు పాల మద్దయ్య. కర్నూలు మండలం చిన్నటేకూరు గ్రామం

రెండేళ్లుగా ఎదురుచూపులే.. నమ్మి మోసపోయాం

2024 జూన్‌ నెలతో పోలిస్తే పింఛన్ల కోత ఇలా..

రెండేళ్లవుతున్నా ఊసేలేని కొత్త పింఛన్లు

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర దాటినప్పటికీ కొత్త పింఛన్ల ఊసెత్తడం లేదు. 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు 50 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు నాకు 62 ఏళ్లు. ఏ పనీ చేయలేని పరిస్థితి. 50 ఏళ్లకే పింఛను ఇస్తామని ఎన్నికల సమయంలో ఊరూవాడా ప్రకటించారు. చంద్రబాబు మాటలకు ఎంతో సంతోషించాం. ఇప్పుడు ఆ మాట ఎత్తకపోవడం ఆందోళన కలిగిస్తోంది. – బి.ఆంజనేయులు,

చిన్నటేకూరు, కల్లూరు మండలం

2024 మే నెలలో జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు మాటలను విశ్వసించాం. ప్రభు త్వం ఏర్పాటై 20 నెలలు అవుతోంది. ఇంతవరకు హా మీ అమలు దిశగా చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నా వయస్సు 58 ఏళ్లు. రెక్కల కష్టం మీద బతుకుతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం ఆదుకోవాలి.

– కుషిదా బేగం, కేఈ మాదన్న నగర్‌, డోన్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): 2024 మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సూపర్‌–6లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛను ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు అవుతున్నప్పటికీ ఈ పింఛను హామీ పట్టాలెక్కని పరిస్థితి. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటీ కొత్త పింఛను ఇవ్వకపోగా ప్రతినెలా పింఛన్లలో కోత పెడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అసెంబ్లీలో త్వరలో కొత్త పింఛన్ల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు అవకాశం ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చని పరిస్థితి. చంద్రబాబు సర్కార్‌ కర్నూలు జిల్లాలో 4,748, నంద్యాల జిల్లాలో 4,163 దివ్యాంగుల పింఛన్లను అనర్హత పేరిట తొలగింపునకు నోటీసులు జారీ చేసింది. వీరంతా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దిగి వచ్చిన ప్రభుత్వం మళ్లీ రీ వెరిఫికేషన్‌కు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో దివ్యాంగుల పింఛన్లు 55,861 ఉండగా.. 48,314 పింఛన్లను రీ వెరిఫికేషన్‌ చేశారు. మిగిలిన 7,547 మంది దివ్యాంగుల పునః పరిశీలన చేపట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియ స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత చేపట్టే అవకాశం ఉంది. దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత వితంతు పింఛన్లను కూడా పునఃపరిశీలన చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్త పింఛన్లకు తప్పని నిరీక్షణ

చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతోంది. ఇంతవరకు కొత్త పింఛన్ల ప్రస్తావనే లేకపోవడం అవ్వతాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50 నుంచి 60 ఏళ్లలోపు అవ్వతాతలు దాదాపు 4.50 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో 60 శాతం మందికి పింఛన్లకు అర్హులే. 2024 జూన్‌ 12వ తేదీ నుంచి ఇప్పటి వరకు కొత్త పింఛన్ల కోసం దాదాపు 2లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త పింఛను దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే ఆప్షన్‌ కూడా ఇవ్వకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

2024 ఎన్నికల సమయంలో

50 ఏళ్లకే పింఛను ప్రకటన

జిల్లా గత ఏడాది జూన్‌ నెల పింఛన్లు ఈ ఏడాది జనవరి నెల పింఛన్లు కోత

కర్నూలు 2,45,687 2.36,185 9,502

నంద్యాల 2,21,702 2.12,494 9,208

మొత్తం 4,67,389 4,48,679 18,710

నెరవేరని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు

50 ఏళ్లకే పింఛను హామీ

అవ్వతాతలు, దివ్యాంగులు,

చేనేత, మత్స్యకారుల నిరీక్షణ

చంద్రబాబు ప్రభుత్వంలో

18710 పింఛన్ల కోత

త్వరలో కొత్త పింఛన్లని

అసెంబ్లీలో ప్రకటన

అయినప్పటికీ ఒక్క అడుగూ

ముందుకుపడని పరిస్థితి

ఇతని పేరు పాల మద్దయ్య. కర్నూలు మండలం చిన్నటేకూరు గ్రామం1
1/4

ఇతని పేరు పాల మద్దయ్య. కర్నూలు మండలం చిన్నటేకూరు గ్రామం

ఇతని పేరు పాల మద్దయ్య. కర్నూలు మండలం చిన్నటేకూరు గ్రామం2
2/4

ఇతని పేరు పాల మద్దయ్య. కర్నూలు మండలం చిన్నటేకూరు గ్రామం

ఇతని పేరు పాల మద్దయ్య. కర్నూలు మండలం చిన్నటేకూరు గ్రామం3
3/4

ఇతని పేరు పాల మద్దయ్య. కర్నూలు మండలం చిన్నటేకూరు గ్రామం

ఇతని పేరు పాల మద్దయ్య. కర్నూలు మండలం చిన్నటేకూరు గ్రామం4
4/4

ఇతని పేరు పాల మద్దయ్య. కర్నూలు మండలం చిన్నటేకూరు గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement