సీనియర్‌ అసిస్టెంట్‌ పదోన్నతి వెనక్కు | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ అసిస్టెంట్‌ పదోన్నతి వెనక్కు

Feb 26 2026 8:37 AM | Updated on Feb 26 2026 8:37 AM

సీనియర్‌ అసిస్టెంట్‌ పదోన్నతి వెనక్కు

సీనియర్‌ అసిస్టెంట్‌ పదోన్నతి వెనక్కు

ఆ 11 మంది గ్రేడ్‌–1 వీఆర్వోలే..

కర్నూలు (సెంట్రల్‌): చంద్రబాబు ప్రభుత్వం 11 మంది సీనియర్‌ అసిస్టెంట్లకు ఇచ్చిన పదోన్నతిని వెనక్కు తీసుకుంది. 2022లో ఉమ్మడి జిల్లాలోని కర్నూలులో నలుగురు, నంద్యాల జిల్లాలో ఏడుగురికి గ్రేడ్‌–1 వీఆర్వో నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించారు. అయితే వీరు డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష పాస్‌ కాలేదన్న నెపంతో వారి పదోన్నతిని చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో ఇన్నాళ్ల వరకు సీనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేసిన వారంతా తిరిగి గ్రేడ్‌–1 వీఆర్వోలుగా పనిచేయాల్సి ఉంటుంది. కాగా ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇచ్చిన పదోన్నతిని వెనక్కు తీసుకోవడం అవివేకమని, వారికి మరో అవకాశమిచ్చి డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో పాసయ్యేలా చూడాలని కోరుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లు పరిష్కరించకుండా వేధిస్తోన్న చంద్రబాబు ప్రభు త్వం తాజాగా ఇచ్చిన పదోన్నతులను వెనక్కు తీసుకోవడం దారుణంగా ఉందని మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement