పాత నోట్లు ఇస్తే.. రూ. కోటి ఇస్తామంటూ.. | - | Sakshi
Sakshi News home page

పాత నోట్లు ఇస్తే.. రూ. కోటి ఇస్తామంటూ..

Feb 16 2026 7:50 AM | Updated on Feb 16 2026 7:50 AM

పాత న

పాత నోట్లు ఇస్తే.. రూ. కోటి ఇస్తామంటూ..

రూ.కోటి ఆశ పెట్టి.. రూ.1.61 లక్షలు కాజేసి

అమాయకుడిని బురిడీ కొట్టించిన సైబర్‌ కేటుగాళ్లు

హొళగుంద: ‘పాత నాణేలు, నోట్లు ఇస్తే రూ.కోటి ఇస్తాం’ అని సైబర్‌ నేరగాళ్లు రూ.1.61,250 కాజేశారు. హొళగుందకు చెందిన బాధితుడు లింగాయత్‌ చంద్రశేఖర్‌ చెప్పిన వివరాల మేరకు.. ఐదు రోజుల క్రితం సెల్‌ నంబర్‌కు ఏపీకే ఫైల్‌ వచ్చింది. దాన్ని ఓపెన్‌ చేసిన వెంటనే అతని మొబైల్‌కు 7340566937 నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. తాము పాత నాణేలు, నోట్లు సేకరణ చేసే రిజర్వ్‌ బ్యాంకు శాఖకు సంబంధించిన కంపెనీ నుంచి మాట్లాతున్నామని వాటిని పంపిస్తే రూ. కోటి పొందవచ్చని నమ్మించారు. అవి లేకపోయినా లక్కీడిప్‌కు ఎంపికయ్యారని, డబ్బును కడితే రూ.కోటి మీకు సొంతం అని ఆశ చూపారు. అమాయకుడైన చంద్రశేఖర్‌ ఇది నమ్మి తన సెల్‌ నుంచి మొదటిగా రూ.750, ఆ తర్వాత రూ.1,250, మరుసటి రోజు రూ.16,500, రూ.42,000. రెండు రోజుల క్రితం మరో రూ.60 వేలు ఫోన్‌పే ద్వారా పంపించాడు. అలాగే శనివారం కూడా మరో రూ.30 వేలును ఫోన్‌ పే చేశాడు. ఇలా బాధితుడు డబ్బులు పంపించిన ప్రతిసారి కంపెనీ, రిజర్వ్‌ బ్యాంకు పేర్లతో ఇన్‌వాయిస్లు, రసీదులుసెల్‌కు పంపించారు. దీంతో బాధితుడు రూ.1,61,250 డబ్బును పంపించాడు. ఈ విషయాన్ని ఆదివారం చంద్రశేఖర్‌ తన స్నేహితుల వద్ద చెప్పగా వారికి అనుమానం వచ్చి ఇది సైబర్‌ నేరగాళ్ల పనేనంటూ నిర్ధారణకు వచ్చి హొళగుంద పోలీసులను ఆశ్రయించారు. తను, తన భార్య రోజూ కూలి పనులు చేసుకుని కూడా బెట్టుకున్న డబ్బుతో పాటు అప్పు తెచ్చి మరీ డబ్బులు పంపించి మోసపోయామని బాధితుడు లబోదిబోమంటున్నాడు.

పాఠశాలలో భారీ వృక్షం నరికివేత

జూపాడుబంగ్లా: మండలకేంద్రమైన జూపాడుబంగ్లా గురుకుల పాఠశాలలో 12 ఏళ్ల నాటి భారీ వృక్షాన్ని నిలువునా నరికేశారు. ప్రతి ఒక్క విద్యార్థి ఓ చెట్టును నాటి సరంక్షించాలని పాఠాలు బోధించే చోటనే ఓ వృక్షాన్ని కొట్టేయడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం అనుమతుల్లేకుండా చెట్లను తొలగించడం నిబంధనలు ఉల్లంఘించడమే.

పాత నోట్లు ఇస్తే.. రూ. కోటి ఇస్తామంటూ..1
1/2

పాత నోట్లు ఇస్తే.. రూ. కోటి ఇస్తామంటూ..

పాత నోట్లు ఇస్తే.. రూ. కోటి ఇస్తామంటూ..2
2/2

పాత నోట్లు ఇస్తే.. రూ. కోటి ఇస్తామంటూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement