నిధులు కేటాయించకపోవడం అన్యాయం
కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయించకపోవడం అన్యాయమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్ అన్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.3.32 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతుల కోసం కేటాయింపులు లేవన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గుండ్రేవుల, వేదావతి, ఆర్‌డీఎస్ కుడి కాలువల నిర్మాణాలకు నిధులు వస్తాయని ఆశించినా ఆశాభంగమే ఎదురైందన్నారు. ప్రస్తుతం బడ్జెట్‌లో కేటాయించిన రూ.479 కోట్లతో మరమ్మతులు కూడా చేయలేరన్నారు. ఆదోని మెడికల్ కాలేజీ, హైకోర్టు బెంచ్‌ౖపైపెగాని బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన రాకపోవడం అన్యాయమన్నారు. పారిశ్రామిక ప్రగతి అంటూ ఉండే టీడీపీ నాయకులు.. ఓర్వకల్ ఇండస్ట్రీయల్ హబ్‌కు, ఎంఎస్‌ఎంఈ పార్లు నిర్మాణాలకు డబ్బులు ఇవ్వకపోతే ప్రగతి ఎలా అవుతుందని ప్రశ్నించారు. సీపీఎం నాయకులు పీఎస్ రాధాకృష్ణ, జి.రామకృష్ణ, కేవీనారాయణ, టి.రాముడు, ఎండీ ఆనంద్‌బాబు పాల్గొన్నారు.


