విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు
ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామం వద్ద రిలయన్స్‌వారు స్థాపిస్తున్న కూల్‌డ్రింక్ పరిశ్రమకు రహదారిని ఏర్పాటు చేయాలని ఏపీఐఐసీ అధికారులకు ప్రతిపాదించారు. ఆ మేరకు ఏపీఐఐసీ వారు హుసేనాపురం నుంచి కాల్వ గ్రామం వరకు సుమారు 2 కి.మీ. దూరం గ్రామంలో కాకుండా, గ్రామం వెలుపల బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూములను కేటాయించారు. దీంతో అధికార పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సదరు నాయకులు అబివృద్ధి ముసుగులో అక్రమ మట్టితవ్వకాలకు తెరతీశారు. టిప్పర్లను అద్దెకు తీసుకొని, కాల్వ రెవెన్యూ పరిధిలో అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టి, రోజుకు విచ్చలవిడిగా మట్టిని రోడ్డు నిర్మాణ పనులకు తరలిస్తున్నారు. రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు స్పందించడం లేదు.


