పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన అనుమతులు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పరిశ్రమల శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి పరిశ్రమలు, ఎగుమతుల పదోన్నతుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల అనుమతులకు సింగిల్ డెస్కు ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఎంఓయూ చేసుకున్న పరిశ్రమలను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి విశ్వ కర్మ యోజన పథకం కింద లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఎల్‌డీఎంకు సూచించారు. పీఎంఈజీపీ కింద ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జీఎం అశోక్‌కుమార్, పీసీబీ ఈఈ కిశోర్‌కుమార్‌రెడ్డి, ఎల్‌డీఎం రామచంద్రరావు, ఏపీఐఐసీ జెడ్‌ఎం మధుసూధన్‌రెడ్డి, డీపీఓ భాస్కర్, డీఆర్‌డీఏ పీడీ వెంకటరమాణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


