అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యాయత్నం
మల్లన్నకు నృత్య నీరాజనం
శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శనివారం ఆలయ నిత్య కళావేదికపై హైదరాబాద్‌కు చెందిన డి. సుధారమ్య వారి బృందం వారిచే సంప్రదాయ నృత్యం ప్రదర్శించారు. కార్యక్రమంలో వినాయక విఘ్నరాజ, మూహికవాహన, జతిస్వరం, నమశ్శివాయతే, శంభో శివశంభో తదితర గీతాలకు పల్లవి, నిత్య, శరణ్య, గౌరి, విజయ తదితరులు నత్యప్రదర్శన ప్రదర్శించారు. – శ్రీశైలం టెంపుల్
పత్తికొండ రూరల్: హోసూరు గ్రామానికి చెందిన కారు మెకానిక్ మస్తాన్ కుమార్తె ఇన్షాబేగం (4)ఏళ్ల బాలికపై శనివారం వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరచింది. చిన్నారి ఆడుకుంటుండగా అకస్మాత్తుగా దాడి చేసి కాలుపై నాలుగు చోట్ల కరచింది. దీంతో బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు కుక్కను తరిమేసి బాలికను కాపాడారు. గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. మండలంలో ఇటీవల కుక్కకాటు కేసులు అధికమవుతున్నా గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
దాడి కేసులో నిందితుల అరెస్టు
కర్నూలు: నగర శివారులోని వీకర్ సెక్షన్ కాలనీలో రామాంజినేయులు, కేశమ్మపై జరిగిన దాడి కేసులో ముగ్గురు నిందితులను నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కల్లూరు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన రాజు, వేణుకుమార్, మహివర్దన్‌లు కలసి ఈనెల 6వ తేదీన రామాంజినేయులు, కేశమ్మలతో ఘర్షణ పడి దాడి చేశారు. దీంతో బాధితులు ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురిరి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.
కోడుమూరు రూరల్: అనుగొండ గ్రామానికి చెందిన రైతు పింజరి కమాల్ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైతు కమాల్ తనకున్న రెండెకరాలతో పాటు, మరో 13 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది 8 ఎకరాల్లో ఉల్లి, 7 ఎకరాల్లో పొగాకు పంట సాగు చేశాడు. ఉల్లికి పెట్టిన పెట్టుబడులు కూడా రాక సుమారు రూ.7 లక్షలకు వరకు నష్టపోయాడు. అంతేగాకుండా కుమార్తె వివాహం, కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు సుమారు రూ.15 లక్షల వరకు రైతుకు ఉన్నట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు గుర్తించి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం తీరుతో రైతుల ఆత్మహత్యలు..
రైతు కమల్ ఆత్మహత్యాయత్నానికి యత్నించిన విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ శనివారం ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. రైతు ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులతో చర్చించడంతో పాటు త్వరగా కోలుకునేలా మెరుగైన చికిత్సనందించాలని సూచించారు. ఈ సందర్భంగా డా.సతీష్ మాట్లాడుతూ.. రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతోనే రైతులు తీవ్రంగా నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ముఖ్యంగా ఉల్లి రైతులకు సీఎం చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని, ఇటు గిట్టుబాటు ధర లభించక, అటు నష్టపోయిన ఉల్లి పంటకు పరిహారం లభించక దిక్కు తోచని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నా రు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామ ని హెచ్చరించారు.
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యాయత్నం


