పక్షుల బెడదకు చెక్
ఈ ఏడాది సాగు చేసిన జొన్న కంకిదశలో ఉండటంతో పంట చుట్టూ ఫ్లిక్కర్స్ (మెరిసే రిబ్బ న్లు) ఏర్పాటు చేసుకుని పక్షుల బారి నుంచి పంట ను కాపాడుకుంటున్నారు. స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్‌లో కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, దొర్నిపా డు మండలాల పరిధిలో ఖరీఫ్, రబీసీజన్లలో 7,119 హెక్టార్లలో రైతులు మహీంద్ర, హైటెక్, తదితర రకాలను చెందిన జొన్న పంట సాగు చేశారు. పంట చేతికందే దశలో పక్షులు కంకిపై వాలి జొన్న పిసుకుళ్లను తిని పంటకు నష్టం చేకూరుస్తున్నాయి. వాటి బారి నుంచి పంటను రక్షించుకునేందుకు జొన్న పంట చుట్టూ మెరిసే రిబ్బన్లు అమర్చారు. అవి ఎండకు మెరుస్తూ.. గాలి కదులుతుండటంతో పక్షులు పంటవైపు రావడం లేదు. – కోవెలకుంట్ల


