
కళ్లుంటే ఈమెకేసి చూడండి..
బండి ఆత్మకూరు: ఈమె పేరు అంబటి చాముండేశ్వరి. బండిఆత్మకూరు మండలంలోని లింగాపురం గ్రామం. 8 సంవత్సరాల క్రితం చిగురు కోసమని చింత చెట్టెక్కడంతో కాలుజారి కిందపడటంతో వెన్నుపూస విరిగింది. రెండు కాళ్లు పనిచేయక మంచానికే పరిమితమైంది. వైద్యులు .... వైకల్యం ఉన్నట్లు నిర్ధారించడంతో పింఛను అందుతోంది. అలనాపాలన చూసుకుంటున్న భర్త గోపాల్‌రెడ్డి(55) రెండేళ్ల క్రితం కాలం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో రీవెరిఫికేషన్ పేరిట ఈమె కు వికలత్వం 40శాతం లోపు ఉన్నట్లుగా నిర్ధా రించి పింఛను తొలగించారు. కనీసం కదల్లేని స్థితిలో ఉన్న ఈమె ప్రభుత్వ నిర్ణయం పట్ల కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.