జీడీపీకి కొనసాగుతున్న వరద | - | Sakshi
Sakshi News home page

జీడీపీకి కొనసాగుతున్న వరద

Aug 19 2025 5:22 AM | Updated on Aug 19 2025 5:22 AM

జీడీప

జీడీపీకి కొనసాగుతున్న వరద

గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టుకు గత వారం రోజులుగా వరద నీటి చేరిక కొనసాగుతోంది. మండలంలో పది రోజులుగా తెలికపాటి నుంచి మోసరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి సోమవారం 300 క్యూసెక్కుల వరద నీరు జీడీపీలోకి చేరినట్లు ప్రాజెక్టు ఏఈ మహమ్మద్‌ ఆలీ తెలిపారు. అలాగే హంద్రీనీవా నుంచి 160 క్యూసెక్కుల నీరు, ఎల్లెల్సీ నుంచి 60 క్యూసె క్కుల నీరు జీడీపీలోకి వస్తుంది. జీడీపీ నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా.. సోమవారం సాయంత్రానికి 2.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు

కర్నూలు: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూ విధి నిర్వహణలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు ఎకై ్సజ్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్లుగా నియమిస్తూ నియామక పత్రాలను జిల్లా అధికారి సుధీర్‌ బాబు అందజేశారు. ఈ మేరకు హైమావతి, సౌమ్యలకు కారుణ్య నియామకాల కింద ఎకై ్సజ్‌ శాఖలో ఉద్యోగాలిస్తూ కలెక్టర్‌ రంజిత్‌ బాషా ఉత్తర్వులిచ్చారు. వీరికి జిల్లా ఎకై ్సజ్‌ అధికారి సుధీర్‌ బాబు సోమవారం తన కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్‌, చంద్రహాస్‌ తదితరులు పాల్గొన్నారు.

క్లస్టర్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా జి. శ్రీనివాస్‌

కర్నూలు సిటీ: క్లస్టర్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న డాక్టర్‌.జి శ్రీనివాస్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు ఉత్తర్వులు జారీ చే శారు. ఈ మేరకు ఆయన సోమవారం రిజిస్ట్రా ర్‌గా బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్‌ కట్టా వెంకటేశ్వర్లు డిప్యూటేషన్‌పై రిజిస్ట్రార్‌గా గత ఏడాది నుంచి పని చేస్తున్నారు. ఆయన పదవీ కాలం ముగియడంతో సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. బాఽ ద్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ను వర్సిటీ వీసీ, ఇప్పటి వరకు రిజిస్ట్రార్‌గా పని చేసిన కె.వెంకటేశ్వర్లు, ఆర్‌యూ రిజిస్ట్రార్‌ విజయ్‌కుమార్‌ శాలువ కప్పి అభినందించారు.

20, 21 తేదీల్లో రీవెరిఫికేషన్‌కు మరో అవకాశం

కర్నూలు(అగ్రికల్చర్‌): దివ్యాంగుల పింఛను తీసుకుంటూ రీ వెరిఫికేషన్‌కు హాజరుకాని వారికి డీఆర్‌డీఏ మరో అవకాశం కల్పించింది. సదరం రీ వెరిఫికేషన్‌కు హాజరు కాలేదనే కారణంలో జిల్లాలో 461 మంది దివ్యాంగుల పింఛన్లను ప్రభుత్వం హోల్డ్‌లో పెట్టింది. వీరికి ఆగస్టు నెల పింఛను పంపిణీ చేయలేదు. రీ వెరిఫికేషన్‌కు హాజరు కాని 461 మందికి ఈ నెల 20, 21 తేదీల్లో సంబంధిత ఆసుపత్రుల్లో డాక్టర్లు రీ వెరిఫికేషన్‌ చేస్తారని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ వైపి రమణారెడ్డి తెలిపారు.

జీడీపీకి కొనసాగుతున్న వరద 1
1/2

జీడీపీకి కొనసాగుతున్న వరద

జీడీపీకి కొనసాగుతున్న వరద 2
2/2

జీడీపీకి కొనసాగుతున్న వరద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement