ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం
డోన్ టౌన్: ప్రమాదవశాత్తూ ఓ ట్రాక్టర్ డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.లక్ష్ముంపల్లె గ్రా మానికి చెందిన ట్రాక్టరు డ్రైవరు వెంకటేశ్ (20) మంగళవారం వెంకటాపురం చెరువు నుంచి ట్రాక్టరు మట్టిలోడుతో బయలుదేరాడు. మార్గమధ్యలో పెద్ద వంక వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి కింద పడటంతో ట్రాక్టర్ ట్రాలీ టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్‌ఐ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.


