పోషకాహారాన్ని ప్రోత్సహించడమే పోషణ్‌ పక్వాడ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పోషకాహారాన్ని ప్రోత్సహించడమే పోషణ్‌ పక్వాడ లక్ష్యం

Apr 16 2025 12:39 AM | Updated on Apr 16 2025 12:39 AM

పోషకాహారాన్ని ప్రోత్సహించడమే పోషణ్‌ పక్వాడ లక్ష్యం

పోషకాహారాన్ని ప్రోత్సహించడమే పోషణ్‌ పక్వాడ లక్ష్యం

కర్నూలు(సెంట్రల్‌): చిన్నారులు, మహిళలకు ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని అందించడమే పోషణ్‌ పక్వాడ లక్ష్యమని జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో జిల్లాస్థాయి పోషణ్‌ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ డెలివరీ అయిన తరువాత 3 సంవత్సరాల వరకు పిల్లలకు తల్లులే పాలు ఇవ్వాలన్నారు. ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ అర్‌జేడీ రోహిణి మాట్లాడుతూ తల్లులు తమ పిల్లలను శక్తివంతులను చేసేందుకు చక్కర, మైదా పిండిలేని ఆహార పదార్థాలను అందివ్వాలని సూచించారు. ఐసీడీఎస్‌ పీడీనిర్మల మాట్లాడుతూ ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్న పోషణ్‌ పక్వాడా అవగాహన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యంపై సూచనలు, సలహాలు అందిస్తామన్నారు. అంతకముందు మిల్టెట్లతో తయారు చేసిన పోషకాహార పదార్థాల ప్రదర్శన స్టాళ్లను జేసీ పరిశీలించారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతాలలను నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ శాంతికళ, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, డీఆర్‌డీఏ పీడీ వైవీ రమణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement