కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

సోమవారం శ్రీ 16 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 అంతా లోపాలమయం.. అయినా ఆరగించేస్తున్నాం నేటి పీజీఆర్‌ఎస్‌ రద్దు భక్తుల కోలాహలం నిత్యాన్నదానానికి విరాళం –8లోu పరిశుభ్రత ఉండటం లేదు.. వైభవం.. సుబ్రహ్మణ్యుని కల్యాణం

న్యూస్‌రీల్‌

ఫుడ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు పాల నుంచి బెల్లం వరకూ అంతా కల్తీనే! గతంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లకు జరిమానాలు అయినా మారని తీరు ఫ్రిడ్జ్‌లలో నిల్వ మాంసం గుర్తింపు జీజీహెచ్‌లో రోగులకు పెట్టే డైట్‌ కూడా సక్రమంగా లేని వైనం

ఇటీవల తనిఖీల్లో గుర్తించిన లోపాలివే..

విజయవాడ జీజీహెచ్‌లో రోగులకు పెట్టే ఆహారం తయారీ చేసే చోట అపరిశుభ్ర వాతావరణం కలిగి ఉండటం, క్రిమికీటకాలు సంచరిస్తుండాన్ని ఆహార తనిఖీ అధికారులు గుర్తించారు.

ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో భాగంగా గొల్లపూడిలోని హోల్‌సేల్‌ మార్కెట్‌లో కూడా తనిఖీలు చేయగా.. అక్కడ బెల్లంలో కల్తీ జరిగినట్లు లేబొరేటరీ నివేదికల్లో స్పష్టమైందని అధికారులు చెబుతున్నారు.

నగరంలోని పలు పేరెన్నిక గల రెస్టారెంట్లలో నిర్వహించిన తనిఖీల్లో రిఫ్రిజిరేటర్లలో మాంసం నిల్వలు ఉండటాన్ని అధికారులు గుర్తించారు.

రెస్టారెంట్లలో ఆహార పదార్థాలు తయారు చేసే చోట అపరిశుభ్ర, హానికర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు స్టాక్‌ కలిగి ఉండటం, ఫుడ్‌ లైసెన్స్‌ లేకుండా వ్యాపారం చేయడం వంటి అనేక లోపాలను అధికారులు గుర్తించారు.

ఈ ఏడాది రాజమండ్రిలో పాలుకల్తీతో పలువురు అనారోగ్యం పాలైన విషయం తెలిసింది. మన ప్రాంతంలో సైతం పాలలో పిండి పదార్థాలు కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

సోమవారం శ్రీ 16 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
అంతా లోపాలమయం.. అయినా ఆరగించేస్తున్నాం

7

చిలకలపూడి(మచిలీపట్నం): ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

పెనుగంచిప్రోలు తిరుపతమ్మవారు కార్తిక మాస ప్రత్యేక అలంకరణల్లో భాగంగా ఆదివారం వివిధ రకాల పూల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి కానూరుకు చెందిన వెలగపూడి సాంబశివరావు, ఉషారాణిల కుమారులు వెంకటేశ్వరరావు,

విజయ్‌కృష్ణ రూ. లక్ష విరాళాన్ని అందజేశారు.

మేము నిర్వహించిన తనిఖీల్లో ఆహారం తయారు చేసే చోట పరిశుభ్రత లోపించడం, హానికర వాతావరణ పరిస్థితులు ఉండటాన్ని గుర్తించాం. ప్రభుత్వాస్పత్రి డైట్‌ తయారీ వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. కూరగాయలు నాసిరకంగా ఉన్నాయి. దీంతో వారికి నోటీసులు ఇచ్చాం. ఏదైనా రెస్టారెంట్‌, హోటల్‌లో ఫుడ్‌ సక్రమంగా లేదని ఫిర్యాదులు వస్తే తనిఖీలు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల తనిఖీలు నిర్వహించాం. అంతేకాక గతంలో నగరంలోని పలు రెస్టారెంట్‌లు, బేకరీలకు జరిమానాలు విధించాం.

– బి. శ్రీనివాసరావు,

ఫుడ్‌ కంట్రోల్‌ అధికారి, విజయవాడ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): షష్టిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట కళావేదికపై స్వామి వారి కల్యాణాన్ని ఆలయ అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత గణపతి పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు శ్రీవల్లీ దేవసేనలను పెళ్లి కుమార్తెలుగా, స్వామి వారి ని పెళ్లికుమారుడిగా అలంకరించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడు మ వేద మంత్రోచ్ఛారణతో ఆలయ అర్చకులు మాంగళ్యధారణ జరిపించారు. పెద్ద ఎత్తున భక్తులు కళావేదిక వద్దకు తరలివచ్చారు.

భక్తుల పోటీ..

అనంతరం స్వామి వారి కల్యాణ తలంబ్రాలను స్వీకరించేందుకు భక్తులు పోటీ పడ్డారు. స్వామి వారి కల్యాణం జరిపించుకున్నా, వీక్షించినా భక్తులలో వివాహం కాని వారికి వివాహ యోగం, సంతానం లేని వారికి సంతానభాగ్యం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, భక్తుల ఇళ్లు సుఖసంతోషాలకు నిలయంగా మారుతుందని ఆలయ అర్చకులు వివరించారు. అనంతరం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని స్వామి వారి ఆలయానికి తీసుకువెళ్లారు. తొలుత తెల్లవారుజామున స్వామి వారి ఆలయంలో ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, అర్చనలు నిర్వహించారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): నాసిరకం నూనెలు.. రంగు, రుచి కోసం సింథటిక్‌ రంగుల వినియోగం.. రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచిన మాంసంతో కూరలు తయారీ.. ఆహార పదా ర్థాలు ఉండే చోట అధ్వానంగా పారిశుద్ధ్యం.. ఇలా ఆహారం ఎక్కడ చూసినా కల్తీమయం అయిపోయింది. నాణ్యమైన ఆహారం తిందామంటే అసలు దొరుకుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకు ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు పలు చోట్ల చేస్తున్న తనిఖీల్లో గుర్తిస్తున్న లోపాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎక్కడ తనిఖీలకు వెళ్లినా ఏదొక లోపాన్ని గుర్తిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పాల నుంచి బెల్లం వరకూ అన్ని సరుకులూ కల్తీల్లా మారి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయా? అని ఆలోచించాల్సి వస్తోంది. అయితే ప్రజలు మాత్రం వాటిని తినడం మానడం లేదు. ఫలితంగా జీర్ణకోశ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు.

కల్తీకాలం.. జరభద్రం..

వీకెండ్స్‌లో కుటుంబ సమేతంగా బయటకు వెళ్లి రెస్టారెంట్లు, హోటళ్ల వంటి వాటిల్లో లంచ్‌, డిన్నర్‌ చేయడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. అంతేకాదు సాయంత్రం అయితే చాలు రోడ్‌సైడ్‌ ఆహారం తినేందుకే ఇప్పటి జనరేషన్‌ ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది. ఉన్నత వర్గాలకు చెందిన వారు సైతం రోడ్డుపై ఫుడ్‌ తినడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే జిల్లాలోని పలు రెస్టారెంట్‌లు, హోటళ్లు, బేకరీలపై జిల్లా ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనేక నాణ్యతా లోపాలు బహిర్గతమవు తున్నాయి. కొన్నింటిపై కేసులు నమోదు చేసి, జరిమానాలు సైతం విధిస్తున్నారు. అయినప్పటికీ కల్తీలు చేస్తూనే ఉన్నారు. ప్రజలు వాటిని అలా తింటూనే ఉన్నారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం..

రంగు రుచి కోసం సింథటిక్‌ రంగులను మితిమీరి వాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. అత్యంత హానికరమైన రసాయనాలు ఉంటున్నట్లు తరచూ ఫుడ్‌ అధికారులు గుర్తిస్తూనే ఉన్నారు. అలాంటి ఆహారం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. బయటి కల్తీ ఆహారం తినే వారిలో పేగు పూతలు, సరిగ్గా జీర్ణం కాకపోవడం, గ్యాస్టైటిస్‌, ఇన్‌ఫ్లమేటరీ పేగు వ్యాధి (ఐడీబీ), వాంతులు, విరేచనాలు వంటివి రావచ్చంటున్నారు. ఇవి దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement