అమ్మో.. ఆక్వాన్‌! | - | Sakshi
Sakshi News home page

అమ్మో.. ఆక్వాన్‌!

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

అమ్మో.. ఆక్వాన్‌!

వెంటాడుతున్న మరో తుపాను భయం

కోతకు సిద్ధమైన వరి

ఆందోళనలో అన్నదాతలు

చల్లపల్లి: రైతులను వరుస కష్టాలు వెంటాడు తున్నాయి. ఈ సీజన్‌లో వర్షాలు సరిగా పడగా ఇబ్బందులు పడిన రైతులకు.. ఇటీవల అకస్మాత్తుగా విరుచు కుపడిన అర్నబ్‌, మురసు తుపాన్లతో కోలుకోలేని దెబ్బ తగిలింది. వాటి నుంచి తేరుకోక ముందే తాజా గా ఆక్వాన్‌ తుపాను హెచ్చరికలతో మరింత బెంబేలెత్తిపోతున్నారు. మరో వారం, 10 రోజుల్లో చేతికందే దశలో ఉన్న పంట మరోసారి ప్రకృతి ప్రకోపానికి బలవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

రైతుల గుండెల్లో గుబులు..

ఈ ఖరీఫ్‌లో రైతులు పెట్టిన పెట్టుబడులు, చేసిన కష్టం అంతా ఇంతా కాదు. గత తుపాన్ల ప్రభావంతో పంట దెబ్బతినటం, పొలాల్లో నీరు నిల్వడం, వరి పైరు నేలకొరగటం వంటి సమస్యలతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. ఈనెల 19వ తేదీన తుపాను ప్రభావం తీవ్రంగా ఉండవచ్చన్న వాతావరణ హెచ్చరికలు రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. భారీ వర్షాలతో, ఈదురు గాలులకు వరి కంకులతో కోత దశకు చేరుకున్న పంట నేలకొరిగి నీట మునిగితే తీవ్ర నష్టం తప్పదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తడిసిపోయి గింజలు మొలకెత్తటం, నాణ్యత తగ్గటం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

గుర్తుకొస్తున్న దివిసీమ ఉప్పెన..

ఆక్వాన్‌ తుపాను ఈనెల 19వ తేదీన తీవ్ర ప్రభావం చూపుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో 1977 నవంబర్‌ 19 దివిసీమ ఉప్పెనతో పోల్చుకుంటూ భయాందోళనలకు గురువుతున్నారు. అయితే అప్పటి విపత్తుతో ప్రస్తుత తుపానుతో పోల్చటం సరికాదని, తుపాను తీవ్రత, ప్రయాణ దిశ, తీరం దాటే ప్రాంతంపై వాతావరణ శాఖ అధికారిక ప్రకటనలనే నమ్మాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement