వైఎస్సార్‌ సీపీలో చేరిన ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ కొండేటి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో చేరిన ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ కొండేటి

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

గన్నవరం: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఉంగుటూరు మండలం పెద్దఆవుటపల్లి గ్రామంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏఎంసీ మాజీ ఏఎంసీ వైస్‌ చైర్మన్‌, టీడీపీ సీనియర్‌ నాయకులు కొండేటి కొండలరావు మరో 100 మంది అనుచరులతో కలిసి ఆదివారం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరందరికి వంశీమోహన్‌ పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్‌ సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంశీమోహన్‌ మాట్లాడుతూ...బీసీ వర్గానికి చెందిన సీనియర్‌ నేత కొండలరావు రాకతో వైఎస్సార్‌ సీపీకి మరింత బలం చేకూరిందన్నారు. ఈ నెల 26న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో పనిచేసి వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. గన్నవరం జెడ్పీటీసీగా ఎన్నికై న అనగాని రవి, మండల, పట్టణ పార్టీ అధ్యక్షుడు పడమట సురేష్‌, మోదుగుమూడి వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎస్‌ఎస్‌ గౌడ్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement