నేతాజీ సైనిక్‌ స్కూల్‌లో విద్యార్థులకు వేధింపులు | - | Sakshi
Sakshi News home page

నేతాజీ సైనిక్‌ స్కూల్‌లో విద్యార్థులకు వేధింపులు

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

నేతాజీ సైనిక్‌ స్కూల్‌లో విద్యార్థులకు వేధింపులు

పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

ఇబ్రహీంపట్నం: మండల పరిధిలోని కేతనకొండ గ్రామంలో ఉన్న నేతాజీ సైనిక్‌ స్కూల్‌లో విద్యార్థులపై వేధింపులు జరుగుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పించి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన పాఠశాల యాజమాన్యం, విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చిన్నారులను డ్రాయర్లపై మోకాళ్లతో నిలబెట్టి శిక్షించడంతో పాటు చితకబాదుతున్నారని, దీంతో పిల్లలు భయాందోళనలకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దసరా పండుగ సెలవులకు ముందు జరిగిన ఘటన పాఠశాల పునఃప్రారంభం నేపథ్యంలో ఆదివారం పిల్లలతో తల్లిదండ్రులు వచ్చారు. పూర్తి ఫీజులు చెల్లిస్తేనే పిల్లలను లోపలకు అనుమతిస్తామంటూ పాఠశాల నిర్వాహకులు గేటుకు తాళం వేశారు.

కనీస సౌకర్యాలు కల్పించని వైనం..

రూ.లక్షల్లో ఫీజులు వెచ్చించి తమ పిల్లలను పాఠశాలలో చేర్పిస్తే కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. విద్యార్థులను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. సుమారు ఏడు గంటల పాటు మోకాళ్లపై నిలబెట్టి శారీరకంగా తమ బిడ్డలను మానసికంగా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ఫీజులు చెల్లిస్తేనే విద్యార్థులను పాఠశాలలోకి అనుమతిస్తామంటూ యాజమాన్యం తలుపులకు తాళాలు వేయడంపై వారు మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం.మహేష్‌ తదితరులు బాసటగా నిలిచారు. పాఠశాల ఎదుట తల్లిదండ్రులతో కలసి ఆందోళనకు దిగారు. విద్యార్థులకు న్యాయం జరగకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ సమస్యలను వివరించినా యాజమాన్యం స్పందించడం లేదన్నారు. ఎంతో నమ్మకంతో నేతాజీ సైనిక్‌ స్కూల్‌లో పిల్లలను చేర్పించి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు తక్షణం స్పందించి మా బిడ్డల భవిష్యత్‌కు భరోసా కల్పించాలని వారు కోరారు.

నా కుమారుడిని సైనిక్‌ స్కూల్లో ఆరో తరగతిలో చేర్పించా. ఫీజు రూ.1.75 లక్షలకు రూ.లక్ష చెల్లించా. పిల్లలను గదిలో బంధించి తీవ్రంగా కొట్టి మోకాళ్లపై గంటల తరబడి నిలబెట్టారు. ఈ ఘటనపై ప్రశ్నించినందుకు ఫీజు మొత్తం చెల్లిస్తేనే లోపలకు అనుమతిస్తామని గేటుకు తాళం వేశారు. అధికారులు స్పందించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.

– పొన్నాల పద్మలత, పేరెంట్‌, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement