ఫైళ్లు కదలవు.. ఉద్యోగోన్నతులు ఇవ్వరు | - | Sakshi
Sakshi News home page

ఫైళ్లు కదలవు.. ఉద్యోగోన్నతులు ఇవ్వరు

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

● డీఎంఈ కార్యాలయంలో ఏళ్ల పాటు పెండింగ్‌లో ఫైళ్లు ● మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి నాగరాజు

● డీఎంఈ కార్యాలయంలో ఏళ్ల పాటు పెండింగ్‌లో ఫైళ్లు ● మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి నాగరాజు

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడి కార్యాలయంలో ఏళ్ల పాటు ఫైళ్లు పెండింగ్‌లో ఉండటంతో వైద్య ఉద్యోగులు శిక్షణ పొందినా ఉద్యోగోన్నతులకు నోచుకోవడం లేదని ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి పి.నాగరాజు పేర్కొన్నారు. విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఆదివారం యూనియన్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాగరాజు మాట్లాడుతూ.. వైద్యశాఖలో రెగ్యులర్‌ నాల్గో తరగతి ఉద్యోగులు డార్క్‌రూమ్‌ అసిస్టెంట్లు, ల్యాబ్‌ అటెండెంట్‌లకు సంబంధించి ఇన్‌సర్వీసు శిక్షణ పొందినట్లు తెలిపారు. వారిని ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఈసీజీ టెక్నీషియన్‌, రేడియోగ్రాఫర్స్‌ పోస్టుల్లో నియమించేందుకు సంబంధించిన ఫైల్‌ డీఎంఈ కార్యాలయంలో ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉందన్నారు. దీంతో వారు ఉద్యోగోన్నతులు పొందలేకపోతున్నారని, సిబ్బంది కొరత వేధిస్తోందని పేర్కొన్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిధిలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌కు వచ్చేందుకు దరఖాస్తు చేసి ఏడాది దాటినా నేటికీ పరిశీలన కూడా చేయలేదన్నారు. ఈ జాప్యం వల్ల అర్హులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సిద్ధార్థ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ లైబ్రరీ పోస్టును భర్తీ చేసేందుకు 2023లో అప్పటి ప్రిన్సిపాల్‌ సీనియారిటీ లిస్టులు సిద్ధం చేసి, ప్రమోషన్‌ పద్ధతిలో ఇచ్చేందుకు డీఎంఈని క్లారిటీ అడిగినా ఆ ఫైలు మూడేళ్లుగా అక్కడే పెండింగ్‌ ఉందన్నారు. సమావేశంలో యూనియన్‌ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు ఎడ్లపల్లి శ్రీనివాసరావు, సిటీ అధ్యక్షురాలు పి.సౌభాగ్యం, జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్‌ కుమార్‌, డెప్యూటీ సెక్రటరీ సాంబయ్య, సిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ కె.శ్రీనివాసరావు, అంజలి త్రినాథ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement