ఎన్నిక పద్ధతే అక్రమం
చైర్మన్ బాలవర్ధనరావుకు హైకోర్టు షాక్
వివాదాల్లో విజయ డెయిరీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయ డెయిరీ పాలకవర్గంలో న్యాయపరమైన ప్రకంపనలు మొదలయ్యాయి. హైకోర్టు తీర్పుతో రెడ్‌బుక్ కుట్రలకు రెడ్‌కార్డు పడింది. విజయ డెయిరీ నూతన చైర్మన్ దాసరి వెంకట బాలవర్ధనరావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనను మిల్క్ డైరెక్టర్ పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. డైరెక్టర్ ఎన్నికే చెల్లదని ప్రకటించడంతో చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మంత్రులతో ఒత్తిడి
అత్యధిక సభ్యుల మద్దతుతో గెలిచిన ఆంజనేయులను రాజీనామా చేయాలని కొందరు ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. ప్రమాణస్వీకారం అయిన వెంటనే మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి నేరుగా విజయా డెయిరీకి వెళ్లి ఆంజనేయులపై వత్తిడి తెచ్చారు. దీన్ని తట్టుకోలేక గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరినా వదలలేదు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయాలని యాజమాన్యంపై వత్తిడి తెచ్చారు. మంత్రి పార్థసారథి ఆసుపత్రికి వెళ్లి మానవత్వాన్ని మరిచిపోయి రాజీనామా లేఖపై సంతకాలు తీసుకుని ఫొటోలు తీయించుకుని మీడియాకు విడుదల చేశారు. ఆ తర్వాత ఆ పదవిలో మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావును కూర్చోబెట్టారు. విజయ డెయిరీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో మంత్రి లోకేష్ తెరవెనుక చక్రం తిప్పినట్లు ఆరోపణలు వినిపించాయి.
ఆ రెండు ఎన్నికలపై..
ఏలూరు జిల్లాకు చెందిన శివరామ్‌ప్రసాద్ భార్య రాట్నాలమ్మ డెయిరీ ఎండీ ఉండగా, ఆయన కూడా మేనేజింగ్ పార్టనర్‌గా వ్యవహరించారు. వీరు పాలుసేకరించి డెయిరీకి సరఫరా చేసే విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తేలడంతో ఆర్బిట్రేషన్ రూ.4.63 కోట్లు చెల్లించాలని దానికి 24 శాతం వడ్డీ చెల్లించాలని యాజమాన్యం ఆదేశించింది. ఈ నేపథ్యంలో 2022లో పాలకవర్గానికి నామినేషన్ వేసిన శివరామ్‌ప్రసాద్‌ను డిస్‌క్వాలిఫై చేశారు. మళ్లీ 2023లో పోటీ చేయడానికి నామినేషన్లు వేయగా దాన్ని కూడా తిరస్కరించారు. ఆయన ఈ రెండు ఎన్నికలపై హైకోర్టులో న్యాయపోరాటం చేశారు. దీంతో 2022లో ఎన్నికై న ముగ్గురు, 2023లో ఎన్నికై న ఇద్దరు పాలకవర్గ సభ్యుల ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో దాసరి పాలకవర్గ సభ్యత్వం చెల్లకుండా పోతుంది. ఆయన పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దీనిపై కోర్టుకు అప్పీల్‌కు వెళ్లడమా, లేక ఎన్నికలకు వెళ్లడమా అనే అంశాలను డిస్‌క్వాలిఫై అయిన పాలకవర్గ సభ్యులు పరిశీలిస్తున్నారు. ఐదుగురిలో ముగ్గురికి ఏడాది మాత్రమే పదవీ కాలం ఉండగా, ఇద్దరికి రెండేళ్ల పదవీ కాలం ఉంది. కోర్టు తీర్పుపై స్పష్టత వచ్చిన తర్వాత విజయ డెయిరీలో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
అసలు బాలవర్ధనరావు చైర్మన్‌గా ఎన్నిక కూడా అక్రమమైన పద్ధతిలో జరిగింది. డెయిరీ చైర్మన్‌గా గెలిచిన చలసాని ఆంజనేయులుపై కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతను మరోసారి డెయిరీ పాలకవర్గ సభ్యుడిగా గెలిచి, సభ్యుల ఆమోదంతో చైర్మన్‌గా ఎన్నిక అయిన తర్వాత దీన్ని జీర్ణించుకోలేని మంత్రి నారా లోకేష్ తన అధికార బలాన్ని ఉపయోగించారు.


