దుర్గమ్మకు 296 గ్రాముల బంగారు ఆభరణాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు 296 గ్రాముల బంగారు ఆభరణాలు

Nov 17 2026 3:44 AM | Updated on Nov 17 2026 3:44 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు రూ.47.37 లక్షల విలువైన బంగారు ఆభరణాలను సోమవారం సమర్పించారు. విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడు గ్రామానికి చెందిన ఎస్‌ఎల్‌వీజీ ప్రసూనాంబ, సీహెచ్‌జీఎస్వీ ప్రసాద్‌ కుటుంబం బంగారు మంగళసూత్రాలు, కాసుల పేరును అమ్మవారికి సమర్పించారు. సుమారు 296 గ్రాముల బంగారంతో తయారు చేయించిన ఆభరణాలతో దాతలు ఆలయానికి విచ్చేయగా చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ వారికి అమ్మవారి దర్శనం కల్పించారు. బంగారు ఆభరణాలను అమ్మవారి వద్ద ఉంచి ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 104 గ్రాముల బంగారంతో మంగళసూత్రాలు, 192 గ్రాములతో కాసుల పేరును తయారు చేయించి దేవస్థాన ఈఓ శీనానాయక్‌కు అందజేశారు. అనంతరం దాతలకు వేద ఆశీర్వచనం, ఈవో శీనానాయక్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

దుర్గమ్మకు రూ. 8.50 లక్షల బంగారు నల్లపూసల దండ

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు కర్ణాటక రాయచూర్‌కు చెందిన భక్తులు రూ. 8.50 లక్షల విలువైన బంగారు నల్లపూసల దండను కానుకగా సోమవారం సమర్పించారు. రాయచూర్‌కు చెందిన శిరీష కుటుంబం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి బంగారు నల్లపూసల దండను సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ కమిటీ చైర్మన్‌ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement