అక్వాన్‌ను సమర్థంగా ఎదుర్కొందాం | - | Sakshi
Sakshi News home page

అక్వాన్‌ను సమర్థంగా ఎదుర్కొందాం

Nov 17 2026 3:44 AM | Updated on Nov 17 2026 3:44 AM

అక్వాన్‌ను సమర్థంగా ఎదుర్కొందాం

కృష్ణా కలెక్టర్‌ బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): అక్వాన్‌ తుపాను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌ నుంచి సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధ ప్రస్తుత సమాచారం మేరకు మంగళవారం నాటికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు – తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపిన సమాచారం మేరకు కలెక్టర్‌ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

తుపాను సమయంలో ఈదురుగాలుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెట్లు పడిపోవటం, విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం వంటివి జరుగుతాయని ముందస్తుగా సంబంధిత అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ముంపు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉండ కుండా డ్రెయిన్లను శుభ్రం చేసుకోవా లన్నారు. రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలీస్‌, అగ్నిమాపకశాఖ సిబ్బంది సహాయకచర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అత్యవసర వైద్యసేవలకు అవసరమైన మందులు, ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మత్స్యకారులు తుపాను హెచ్చరికల నేపథ్యంలో సముద్రంలో వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement