జిల్లా పరిషత్‌కు స్వచ్ఛతా అవార్డు | - | Sakshi
Sakshi News home page

జిల్లా పరిషత్‌కు స్వచ్ఛతా అవార్డు

Oct 2 2026 7:38 AM | Updated on Oct 2 2026 7:38 AM

జిల్లా పరిషత్‌కు స్వచ్ఛతా అవార్డు చంద్రకళను స్ఫూర్తిగా తీసుకోవాలి ఘనంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ వ్యవస్థాపక దినోత్సవం ఎయిర్‌పోర్ట్‌లో బదోనియాకు స్వాగతం

చిలకలపూడి(మచిలీపట్నం): స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛ దివస్‌ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా పరిషత్‌ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకున్నట్లు జెడ్పీ సీఈవో జె. అరుణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సమూల మార్పులు చేపట్టామని.. మహిళా సిబ్బందికి విశ్రాంతి భవనం, ఉద్యోగుల పిల్లలకు ఏసీ చైల్డ్‌ కేర్‌ సెంటరు ఏర్పాటు చేయటం తదితర సౌకర్యాలు కల్పించటంలో జిల్లా పరిషత్‌కు ఈ అవార్డు దక్కిందన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో వచ్చిన ఈ అవార్డును శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా స్వీకరిస్తామని ఆమె తెలిపారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కామన్‌వెల్త్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో శీరా చంద్రకళ రజత పతకం పొంది మహిళల్లో క్రీడా స్ఫూర్తిని కలిగిచిందని పలువురు క్రీడాకారులు, ఎకై ్సజ్‌ సిబ్బంది కొనియాడారు. స్థానిక గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో గురువారం చంద్రకళను సత్కరించారు. ఎకై ్సజ్‌ శాఖకు చెందిన సిబ్బంది, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న విజయవాడకు చెందిన చంద్రకళ రజత పతకాన్ని పొందడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. రజత పతక విజేత చంద్రకళ మాట్లాడుతూ తన కోచ్‌ కంది అప్పారావు ప్రోత్సాహంతో పాటు, కెనడా వెళ్లడానికి అవసరమైన స్పాన్సర్‌షిప్‌ను, సహకారాన్ని అందించిన ఎకై ్సజ్‌ శాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రకళ కుటుంబ సభ్యులు లక్ష్మి, రాము, సాయి దుర్గా తదితరులు పాల్గొని ఆమెకు సత్కరించి అభినందించారు.

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు చూపిస్తున్న ఆదరాభిమానాలు మరువలేనివని.. వారికి మరింత మెరుగైన సేవలు అందించటానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏపీ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం. శేషాచలం అన్నారు. స్థానిక బీఆర్టీఎస్‌ రోడ్డులో గురువారం బీఎస్‌ఎన్‌ఎల్‌ 26వ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల 5కే రన్‌ కార్యక్రమం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుల అవసరాలు ఆకాంక్షలకు అనుగుణంగా తాము పనిచేస్తున్నామన్నారు. అనంతరం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను వివరిస్తూ ప్లకార్డులను చేతబూని ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 5కే రన్‌లో ప్రిన్సిపల్‌ మేనేజర్‌ వై. రవీంద్రనాథ్‌, ఎల్‌. శ్రీను, జనరల్‌ మేనేజర్‌ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గన్నవరం: బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా నియమితులైన డాక్టర్‌ అరవింద్‌సింగ్‌ బదోనియాకు గన్నవరం విమానాశ్రయంలో గురువారం ఆ పార్టీ నేతలు స్వాగతం పలికారు. విజయవాడలో జరగనున్న పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి విచ్చేశారు. విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, ఎంపీ సీఎం రమేష్‌, బీజేపీ నేతలు చిగురుపాటి కుమారస్వామి, పాతూరి నాగభూషణం తదితరులు స్వాగతం పలికారు. అనంతరం కేసరపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన మన ఊరు–మన జెండా కార్యక్రమంలో డాక్టర్‌ అరవింద్‌సింగ్‌ బదోనియా పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆయన ఎగురవేశారు. వచ్చే స్థానిక సంస్ధల ఎన్నికల్లో కూడా సత్తాచాటేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ నేతలు నాదెండ్ల మోహన్‌, నీలం అశోక్‌, ఫణికుమార్‌, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement