వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి

Oct 2 2026 7:38 AM | Updated on Oct 2 2026 7:38 AM

మచిలీపట్నంఅర్బన్‌: రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరత్నం డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ వద్ద వీఆర్‌ఏలు ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా కమిటీలు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడుతూ వీఆర్‌ఏలుగా 30 ఏళ్లకు పైగా పనిచేస్తున్నప్పటికీ పలువురికి ఉద్యోగోన్నతులు లభించడం లేదన్నారు. పాత నిబంధనల ప్రకారం వీఆర్‌ఏల నుంచి వీఆర్వోలుగా కల్పిస్తున్న 30 శాతం ఉద్యోగోన్నతి కోటాను 75 శాతానికి పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి చాట్ల రమేష్‌, ఉపాధ్యక్షుడు ఎన్‌. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement