హంసలదీవి బీచ్‌లో ‘స్వచ్ఛతాహి సేవా’ | - | Sakshi
Sakshi News home page

హంసలదీవి బీచ్‌లో ‘స్వచ్ఛతాహి సేవా’

Oct 2 2026 7:38 AM | Updated on Oct 2 2026 7:38 AM

కోడూరు: సామాజిక బాధ్యతలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌(ఏపీజీబీ) ఆధ్వర్యంలో హంసలదీవి బీచ్‌లో స్వచ్ఛతాహి సేవా, విజిలెన్స్‌ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గుడివాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో, కోడూరు శాఖ మార్గదర్శకత్వంలో అటవీ శాఖ సహకారంతో చేపట్టిన కార్యక్రమంలో 50 మంది బ్యాంకు సిబ్బంది పాల్గొని బీచ్‌ పరిసరాలను శుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రాంతీయ మేనేజర్‌ కె.ఆంజనేయులు, మచిలీపట్నం మేనేజర్‌ సీహెచ్‌. అశోక్‌ సాయి, ప్రాంతీయ విజిలెన్స్‌ అధికారి ఆర్‌.జగదీశ్‌ కుమార్‌, కోడూరు శాఖ మేనేజర్‌ వినయ్‌ పాల్గొని బీచ్‌ పరిసరాలను శుభ్రపర్చారు. అటవీ అధికారులు వీరిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement