● లిస్టులో లేని వారికి పట్టాలు
ఏవిధంగా ఇచ్చారు?
● నిజమైన రైతులకు న్యాయం చేయాలి
● లంకపల్లి గ్రామ రైతుల ఆవేదన
పామర్రు: అసలైన రైతులకు లంక భూములు కేటాయించకుండా అనుయాయులకు అక్రమంగా భూములు కట్టబెట్టడంపై పునః పరిశీలన చేయాలని పమిడిముక్కల మండలం లంకపల్లికి చెందిన రైతులు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. నిజమైన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ లంక భూముల రైతులు మాజీ శాసన సభ్యులు కై లే అనిల్‌కుమార్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1952లో జమీందారీ కుటుంబీకులు తమకు ఇచ్చిన భూములను అప్పటి నుంచి మా ఆధీనంలో ఉండి సాగు చేసుకుంటున్నామని తెలిపారు. లంకపల్లి లంక ప్రభుత్వ లంక భూమిలో సర్వే నం.13లో 106.35 ఎకరాలు, సర్వే నం.14లో 265.25 ఎకరాలు మొత్తం 371.60 ఎకరాల భూమిని అప్పటి నుంచి సాగు చేస్తున్నామని వివరించారు. ఆయా ప్రాంతంలో రీ సర్వే నిర్వహించగా మొత్తం 600 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించారని అన్నారు. లంకపల్లి లంకలో 250 ఎకరాలకు పాస్ పుస్తకాలు ఉండగా, రికార్డులలో లేని వారి పేరుతో వీలునామాలు సృష్టించి అధికారులు పట్టాలు మంజూరు చేశారని ఆరోపించారు. అదేవిధంగా నిరుపేదలైన వారికి చెందాల్సిన భూములను నిషేధిత జాబితాలో చూపిస్తూ, ప్రభుత్వ భూములుగా గుర్తించి వాటిలో ఇసుక తవ్వకాలను అనుమతులను ఇచ్చేశారని అన్నారు. భూ రీసర్వే జరిపి వారి భూములు వారికి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారని అన్నారు.
రికార్డులు తారుమారు..
ఈ రీ సర్వే పేరుతో అధికారులు కుమ్మకై ్క రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. గతంలో వివిధ కారణాలతో నదీగర్భంలో కలిసి పోయిన భూములను ఎలా సర్వే చేసి హద్దులు గుర్తించారని ప్రశ్నించారు. ఇదే గ్రామానికి చెందిన ఒక్క ఎకరం భూమి లేని కోగంటి పూర్ణచంద్రరరావుకు 30 ఎకరాలు ఏవిధంగా కేటాయించారని ప్రశ్నించారు. మన్నె కోటేశ్వరరావుకు 12.5 ఎకరాలు, మన్నె శ్రీనివాసరావుకు 25 ఎకరాలు కేటాయించారన్నారు. గ్రామంలో మానసిక పరిస్ధితి సరిగాలేని కృష్ణ చైతన్య పేరుతో ఏకంగా 16.77 ఎకరాలు కేటాయించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అనుయాయులు సుమారు 10 మందికి 30 ఎకరాల వరకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఏవిధంగా ఇచ్చారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే బినామీగా ఉండే గంటా సురేష్‌తో కుమ్మకై తహసీల్దార్ కేటాయించినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ నేతృత్వంలో ఉయ్యూరు ఆర్డీవో, కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేసినట్టు గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కూడా కలిసి ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వ నేతలు స్పందించి నిజమైన లబ్దిదారులకు భూములను అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నడకుదిటి రాజేంద్ర, జిల్లా ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తాడిశెట్టి శ్రీనివాసరావు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి శ్రీనివాసరావులు రైతులకు న్యాయం చేయాలని కోరిన వారిలో ఉన్నారు.


