స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం

Sep 6 2026 2:13 AM | Updated on Sep 6 2026 2:13 AM

జిల్లాలో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరేద్దాం కూటమి వైఫల్యాలను ప్రతి ఒక్కరికీ తెలియచేద్దాం గత ఐదేళ్ల పాలనలో చేసిన మంచిని వివరిద్దాం జిల్లా వైఎస్సార్‌ సీపీ సంస్థాగత సమావేశంలో దేవినేని అవినాష్‌, ఇతర నేతలు దిశా నిర్దేశం

పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి : దేవినేని అవినాష్‌

లబ్బీపేట(విజయవాడతూర్పు): రానున్న స్థానిక ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరేద్దామని, ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 23 నుంచి ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలు తెలియజేద్దామని, గత ఐదేళ్లలో మనం చేసిన మంచిని వివరిద్దామని ఆయన పేర్కొన్నారు. విజయవాడ శేషసాయి కల్యాణ మండపంలో శనివారం వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా సంస్థాగత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తొలుత టీచర్స్‌ డే సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభించారు.

రాబోయే ఎన్నికలు ఒక మంచి మలుపు: వెలంపల్లి

వైఎస్సార్‌ సీపీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక మంచి మలుపు అని మాజీ మంత్రి, పశ్చిమ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే వైఎస్సార్‌ సీపీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం తథ్యమన్నారు. ఎన్టీఆర్‌ నుంచి నేటి ఏపీ ప్రజల వరకు చంద్రబాబు అందరినీ వెన్నుపోటు పొడిచారన్నారు. వైఎస్‌ జగన్‌ కంటే ఎక్కువ లబ్ధి చేకూరుస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారన్నారు.

పార్టీకో రకంగా పోలీసు చట్టాలున్నాయా: మల్లాది విష్ణు

విజయవాడ ఎంజీ రోడ్డులో బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహిస్తే పోలీసులు ఏ ప్రాతిపదికన అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. జనసేన పార్టీ రోడ్డుపై షోలు, సమావేశాలు నిర్వహిస్తుంటే అనుమతులు ఎలా ఇస్తున్నారని ఆయన నిలదీశారు. నారా లోకేష్‌ సెమినార్‌ పేరుతో వచ్చినప్పుడు బస్టాప్‌లు, రహదారులన్నింటినీ ఫ్లెక్సీలు, బ్యానర్లతో నింపేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. వైఎస్సార్‌ సీపీకి ఒక రకంగా కూటమికి మరొక రకంగా చట్టాలుంటాయా అని ఆయన పశ్నించారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన శాంతియుత నిరసన ప్రదర్శనలకు అడుగడుగునా బారికేడ్లు, డైవర్షన్లు పెట్టి అడ్డుకోవడాన్ని ఖండించారు. పేదవారికి సొంతింటి ఆస్తిని అందించిన ఏకై క పార్టీ వైఎస్సార్‌ సీపీ మాత్రమేనని స్పష్టం చేశారు.

ప్రజలను నమ్మించి మోసం చేశారు: మొండితోక

ఎన్నికల సమయంలో వైఎస్‌ జగన్‌ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు, ప్రజలను నమ్మించి మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే, పార్టీ నందిగామ ఇన్‌చార్జి మొండితోక జగన్మోహన్‌రావు మండిపడ్డారు. చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ అని ప్రజలందరికీ అర్థమయిందన్నారు.

హామీలు నెరవేర్చడంలో విఫలం: నల్లగట్ల

నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు, కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.3 వేల కోట్లు ఏమయ్యాయని మాజీ ఎమ్మెల్యే, తిరువూరు ఇన్‌చార్జి నల్లగట్ట స్వామిదాసు ప్రశ్నించారు. వయస్సు 50 ఏళ్లు నిండిన వారికి ఫించన్‌ ఎందుకు ఇవ్వలేక పోతున్నారని నిలదీశారు. ఈ సమావేశంలో జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తన్నీరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు ఎండీ రూహుల్లా, మొండితోక అరుణ కుమార్‌, రాష్ట్ర కోఆర్డినేటర్‌ కందుల రవీంద్ర, మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఆసిఫ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి నాగేంద్ర పుణ్యశీల, గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.

ఈ రెండున్నర ఏళ్ల కూటమి పాలనలో సంక్షేమ పథకాలు లేక, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురైనట్లు తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరటం ఖాయమన్నారు. నారా లోకేష్‌ ఆధ్వర్యంలో డీఎస్సీ స్కామ్‌ జరిగిందన్నారు. తప్పుడు కేసులు పెట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement