గంజాయి విక్రేతల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రేతల అరెస్టు

Sep 6 2026 2:13 AM | Updated on Sep 6 2026 2:13 AM

ఉయ్యూరు: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఎనిమిది మందిని ఉయ్యూరు రూరల్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ధర్మేంద్ర ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని పెద ఓగిరాలలో కొంత మంది యువకులు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందటంతో ఎస్‌ఐ సురేష్‌బాబు తన సిబ్బందితో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోగా వారిలో ముగ్గురు మైనర్లుగా గుర్తించారు. నిందితులు పోలిమెట్ల సందీప్‌, కట్టా నాగబాబు, చాగంటిపాటి ఆకాశ్‌, చీలి భార్గవ్‌, తలకంటి షణ్ముఖ్‌ను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో కంకిపాడు సీఐ బి.బి. రవికుమార్‌, ఎస్‌ఐ సురేష్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement