ఎంపీఏ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ఎంపీఏ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు

Sep 6 2026 2:13 AM | Updated on Sep 6 2026 2:13 AM

ఎంపీఏ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు పామర్రు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (రాజమహేంద్రవరం) శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో ఎంపీఏ (మాస్టర్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌) మొదటి సంవత్సరం సెకండ్‌ సెమిస్టర్‌లో రెండు రోజుల పాటు జరిగే ప్రాక్టికల్‌ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. వీటికి 23 మంది విద్యార్థులు హాజరవ్వగా పరీక్ష అధికారిగా ప్రభుత్వ సంగీత సృత్య కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్‌ పసుమర్తి శ్రీనివాస శర్మ వ్యవహరించారు. వీటిని వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చింతా రవి బాలకృష్ణ నిర్వహించారు. విద్యార్థులు నాట్యానికి మూల పురుషులైన నటరాజస్వామికి, సిద్ధేంద్ర యోగికి నాట్య నీరాజనాలు అర్పించి పరీక్షలకు హాజరయ్యారు. రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): రీ సర్వేతో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, దీనిలో రైతులను భాగస్వాములను చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్‌, ల్యాండ్‌ రికార్డ్స్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ అన్నారు. గుంటుపల్లిలో నిర్వహిస్తున్న రీ సర్వే కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి శనివారం ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. రైతుల సమక్షంలో సర్వే జరగడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వేలో తప్పులు పునరావృతం కాకుండా రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సర్వే పూర్తైన తర్వాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా సరిహద్దుల నిర్ణయం రైతు సమక్షంలోనే జరగాలని సూచించారు. తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేయాలని ఆదేశించారు. రైతు చేతికి పట్టాదారు పాసుపుస్తకం అందజేసే వరకు పర్యవేక్షించాలని జిల్లా సర్వే అధికారి వై.మోహనరావును ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రీ సర్వేల్లో ఫేజ్‌–1లో 628, ఫేజ్‌–2లో 748, ఫేజ్‌–3లో 729, ఫేజ్‌–4లో 1645 గ్రామాల్లో నిర్వహిస్తున్నామన్నారు. 2,800 మందితో అత్యాధునిక రోవర్స్‌తో సర్వే జరుగుతుందన్నారు. ఫేజ్‌–5లో కూడా 1,343 గ్రామాల్లో సర్వే మొదలైనట్లు వెల్లడించారు. జిల్లా సర్వే అధికారి వై.మోహనరావు, రెవెన్యూ, సర్వే సిబ్బంది, పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు హైరిస్క్‌ గర్భిణులపై ప్రత్యేక దృష్టి పెట్టండి

మోపిదేవి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పీఎల్‌ దయాకర్‌ అధికారులకు సూచించారు. మోపిదేవి పీహెచ్‌సీని శనివారం డీఎంహెచ్‌వో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలోని వైద్య సేవలు, రోగులకు అందుతున్న సదుపాయాలు, మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో డెలివరీ కేసులు తక్కువగా ఉన్నాయని, మరింత పెంచాలని స్టాఫ్‌ నర్సులకు సూచించారు. అనంతరం స్థానికుల బలానికి ఇంజెక్షన్లు పీహెచ్‌సీలో కూడా అందుబాటులోకి తీసుకురావాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందాలన్నారు. డాక్టర్‌ లక్ష్మీనాఽథ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): హైరిస్క్‌ గర్భిణులను గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలని ఎన్టీఆర్‌ జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎ.శ్రావణ్‌బాబు అన్నారు. ఆయన శనివారం నగరంలోని అజిత్‌సింగ్‌నగర్‌ యూపీహెచ్‌సీని సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఓపీ విభాగం, రోగుల రిజిస్టర్లు, మందుల నిల్వలు, అత్యవసర మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది హాజరు తదితర అంశాలను తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించి, సంబంధిత సిబ్బందిని ఓపెన్‌ వయాల్‌ పాలసీ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్‌ శ్రావణ్‌బాబు మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ యాని నవీన, వైద్య సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement