గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమ బద్ధీకరణ (రెగ్యులరైజేషన్) చేయడం పట్ల అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడలోని ఎన్జీవో హోం నందు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. విద్యాసాగర్‌ను కాంట్రాక్ట్ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం ఎన్జీవో అసోసియేషన్ కృషి, చొరవతోనే కేబినెట్ ఆమోదంతో పాటు బిల్లు పాస్ అయ్యిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులకు, ఏపీ ఎన్జీవో ప్రతినిధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.


