ఆక్వాటిక్స్‌ పోటీల్లో సత్తా | - | Sakshi
Sakshi News home page

ఆక్వాటిక్స్‌ పోటీల్లో సత్తా

Aug 22 2026 2:11 AM | Updated on Aug 22 2026 2:11 AM

ఆక్వాటిక్స్‌ పోటీల్లో సత్తా

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఒడిశా భువనేశ్వర్‌లోని కళింగ స్డేడియంలో జరుగుతున్న 52వ జూనియర్‌ జాతీయ ఆక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌–2026లో ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన స్విమ్మర్‌ ఎం.యజ్ఞసాయి ప్రతిభ చూపాడు. శుక్రవారం జరిగిన బాలుర గ్రూప్‌–1బీ(అండర్‌–16) 200 మీటర్ల బటర్‌ఫ్లై స్టైల్‌ను 2:09:32 సెకన్లలో పూర్తి కాంస్య పతకాన్ని పొందాడు. 52వ జూనియర్‌ జాతీయ ఆక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌–2026లో గురువారం జరిగిన బాలుర గ్రూప్‌–1బీ 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌ విభాగాన్ని 16:56:1 సెకన్లలో పూర్తి చేసిన ఎం.యజ్ఞసాయి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ చాంపియన్‌షిప్‌లో రజత, కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న యజ్ఞసాయిని ఆంధ్రప్రదేశ్‌ అమెచ్యూర్‌ అక్వాటిక్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ కె.రవికాంత్‌, అధ్యక్షుడు ఎం.ఓబుల్‌రెడ్డి, కార్యదర్శి మోహన్‌ వెంకట్‌ రామ్‌లతో పాటుగా కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ సభ్యులు, స్విమ్మర్లు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో జరిగే పోటిల్లో కూడా యజ్ఞసాయి ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement