ెపనమలూరు: మండలంలోని గోసాల గ్రామ పరిధిలో బందరు కాలువలో వృద్ధుడు గల్లంతవటంతో పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. గోసాల వేణుగోపాలస్వామినగర్‌కు చెందిన కొడాలి సూరి బాబు(60) మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతని భార్య పద్మ వేరుపడింది. సూరిబాబు ఆ ప్రాంతంలోనే ఒంటరిగా నివసిస్తున్నాడు. శుక్రవారం సూరిబాబు తన మిత్రుడు శ్రీనుతో కలిసి బందరు కాలువలో స్నానానికి దిగాడు. స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకు పోయాడు. ఈ సమాచారం సూరిబాబు భార్యకు తెలిసి, తన బంధువులతో బందరు కాలువలో గాలించారు. అయినా సూరిబాబు జాడ తెలియ లేదు. పద్మ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.


