● సంగీత దృష్టి.. ‘గండూరి’ స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

● సంగీత దృష్టి.. ‘గండూరి’ స్ఫూర్తి

Aug 6 2026 8:14 AM | Updated on Aug 6 2026 8:14 AM

● సంగీత దృష్టి.. ‘గండూరి’ స్ఫూర్తి స్వరఝరిలో.. విధిని ఎదిరించి దివ్యాంగుడు సాగిస్తున్న సంగీత ప్రస్థానం విజయవాడ కల్చరల్‌: సంగీత రంగంలో తన గాన మాధుర్యంతో పాటు వయోలిన్‌ వాయించడంలోనూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న దివ్యాంగుడు గండూరి శ్రీనివాసమూర్తి. జన్మతహా దృష్టి దోషం ఉన్నప్పటికీ.. అది ఆయ న సంగీత సామర్థ్యాన్ని అడ్డుకోలేక పోయింది. సంగీతాన్నే చూపుగా, స్వరాన్నే తన జీవన మార్గంగా విశిష్ట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. విజయవాడ నగరమే అందుకు వేదికై ంది. గండూరి శ్రీనివాసమూర్తి.. సాంబశివరావు, కామేశ్వరమ్మ దంపతులకు 1965 ఆగస్టు 16న విజయవాడలో జన్మించారు. సంగీత విద్వాంసులు వఝుల రామ్మోనరావు, కోటిపల్లి సూర్యప్రకాశరావుల వద్ద సంగీతంలో తొలి అడుగులు వేశారు. ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య కళాశాలలో అటు వయోలిన్‌తో పాటు గాత్రంలోనూ తర్ఫీదు పొంది సంగీత సవ్యసాచిగా నిలిచారు. 1981లో ప్రారంభమైన ఆయన సంగీత ప్రస్థానం 45 ఏళ్లుగా నిరంతరాయంగా సాగుతోంది. గత 35ఏళ్లుగా వయోలిన్‌పై వేలాది మంది విద్యార్థులకు శిక్షణ నిస్తున్నారు. దేశంలో వివిధ ప్రాంతాలలో కచేరీలు నిర్వహించడమే కాక, ప్రముఖ విద్వాంసులకు వాద్య సహకారం కూడా అందించారు. శారీరక వైకల్యం ప్రతిభకు అడ్డుకాదని.. పట్టుదలతో సాధన చేస్తే అసాధ్యమనేదే ఉండదని శ్రీనివాసమూర్తి జీవితం గొప్ప సందేశాన్ని నేర్పుతుంది. తన వైకల్యాన్ని బలహీనతగా కాకుండా.. సంకల్ప బలంతో విజయతీరాలకు చేరుకున్న ఆయన జీవితం ఆదర్శనీయం. ఆయన సంప్రదాయ గురువుగా ప్రచారానికి దూరంగా ఉంటూ కేవలం సంగీత సాధన, బోధనకే జీవితాన్ని అంకితం చేశారు. మనీషా సాంస్కృతిక సేవా సంస్థ, సద్గురు సంగీత సభ, నాదక్షేత్రం, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచే కళారత్న, త్యాగరాజ కళాసమితి తిరువూరుతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సంస్థలు ఆయన సంగీత సేవలను గుర్తించి ఘనంగా సత్కరించాయి. ఇటీవల శ్రీనివాసమూర్తి షష్టి పూర్తి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆయన శిష్యులు ఘనంగా గురు సత్కారం చేయడం విశేషం.

యువ గాయనీ గాయకులకు స్ఫూర్తి గండూరి శ్రీనివాసమూర్తి పుట్టుకతోనే దృష్టి లోపం ఉన్నా వెనుతీయని పయనం ఆకట్టుకునే గాత్రంతో పాటు వయోలిన్‌పై విశేష ప్రతిభ

సంగీతం.. ఇహపర సాధనం

సంగీతాన్ని ఇహపర సాధనగా భావించాలి. సంగీతం, సాహిత్యం భగవదత్తమైన వరాలు. వాటిని భక్తిగా చిత్తశుద్ధితో అధ్యయనం చేయాలి. సంగీతమనేది నిరంతరం సాధన చేస్తేనే దానిలో ప్రావీణ్యం సాధించగలం. గురువుముఖత నేర్చుకొనే సంగీతం తప్పక రాణిస్తుంది.

– గండూరి శ్రీనివాసమూర్తి,

సంగీత కళాకారుడు

ఆత్మవిశ్వాసమే ఆలంబనగా.. కఠోర సాధనే విజయ రహస్యంగా.. పుట్టుకతో వచ్చిన వైకల్యాన్ని ఎదిరించి నిలబడ్డారు.. తన గాత్రంతో శ్రోతలను ఉర్రూతలూగించడంతో పాటు వయోలిన్‌పై సరిగమలు పలికిస్తూ అందరిచేత వహ్వా అనిపించుకుంటున్నారు.. మరోవైపు ఔత్సాహికులకు సంగీతంలో శిక్షణనిస్తూ.. శాసీ్త్రయ సంగీతంపై యువతలో ఆసక్తిని పెంచేందుకు కృషి చేస్తున్నారు. అంధుడైనా.. తన సంగీత దృష్టితో వందలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయనే విజయవాడకు చెందిన గండూరి శ్రీనివాసమూర్తి.

వయోలిన్‌పై ప్రదర్శన ఇస్తున్న గండూరి శ్రీనివాసమూర్తి(ఫైల్‌)

వాయులీనమై..

ఇదీ ప్రస్థానం..

జీవితం.. స్ఫూర్తి దాయకం..

విశేష పురస్కారాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement