కొండలమ్మ సన్నిధిలో అన్నసమారాధనకు విరాళం | - | Sakshi
Sakshi News home page

కొండలమ్మ సన్నిధిలో అన్నసమారాధనకు విరాళం

Aug 5 2026 2:23 AM | Updated on Aug 5 2026 2:23 AM

కొండలమ్మ సన్నిధిలో అన్నసమారాధనకు విరాళం గుడ్లవల్లేరు: మండలంలోని వేమవరంలో వేంచేసియున్న శ్రీ కొండలమ్మ వారి దేవస్థానంలో భక్తులకు అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. దాని నిమిత్తం కౌతవరం గ్రామానికి చెందిన నిమ్మగడ్డ వెంకట నాంచారయ్య, విజయలక్ష్మి రూ.5లక్షల చెక్కును విరాళంగా సమర్పించారు. ఆ దాత కుటుంబాన్ని దేవస్థాన చైర్మన్‌ ఈడే వెంకట విష్ణు మోహనరావు, ఈఓ ఆకుల కొండలరావు, ధర్మకర్తలు రవీంద్రబాబు, కళ్లేపల్లి సుగుణ శేఖర్‌, పెన్నేరు వీర వెంకట నాగ లీలా శేఖర్‌ సన్మానించి లడ్డూ ప్రసాదాలతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. 10న పాలిటెక్నిక్‌ స్పాట్‌ అడ్మిషన్లు మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో చేరేందుకు ఈ నెల 10వ తేదీన స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.విజయసారథి ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయగా మిగిలిన సీట్లను ఈ స్పాట్‌ అడ్మిషన్లలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై, పాలిసెట్‌–2026 పరీక్ష రాసిన, రాయని వారు ఈ స్పాట్‌ అడ్మిషన్లల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు వారి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్‌ పత్రాలతో విజయవాడ రమేష్‌ ఆస్పత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు నేరుగా హజరు కావాల్సిందిగా ఆయన కోరారు. దుర్గమ్మకు కానుకగా బంగారు హారం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు కర్నూలుకు చెందిన భక్తులు మంగళవారం బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. కర్నూలుకు చెందిన వెంకటేశ్వరరావు, రాజేశ్వరి దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి సుమారు రూ. 3.88 లక్షలతో తయారు చేయించిన బంగారు హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకులు డీవీవీ సత్యనారాయణ, మధులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. రేపటి నుంచి జిల్లా స్థాయి పోటీలు

మచిలీపట్నంఅర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్‌షిప్‌–2026లో భాగంగా నియోజకవర్గ స్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఈ నెల ఆరో తేదీ నుంచి ఈ నెల 13వ తేదీ వరకు జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) ఝాన్సీ లక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 6న హాకీ ఎంపికలు గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో, షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆత్మూరు ఇండోర్‌ స్టేడియంలో, చెస్‌, బాస్కెట్‌బాల్‌ ఎంపికలు మచిలీపట్నం డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించనున్నారన్నారు. ఆగస్టు 7న అథ్లెటిక్స్‌ ఎంపికలు గుడివాడ ఎన్టీఆర్‌ స్టేడియంలో, బాక్సింగ్‌ ఎంపికలు మచిలీపట్నం డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతాయన్నారు. ఆగస్టు 8న ఆర్చరీ, 9న యోగా ఎంపికలు మచిలీపట్నం డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో.. ఆగస్టు 10న వెయిట్‌లిఫ్టింగ్‌, ఖో–ఖో ఎంపికలు గుడివాడ ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తారన్నారు. వాలీబాల్‌ ఎంపికలు ఆగస్టు 10, 11 తేదీల్లో, కబడ్డీ ఎంపికలు ఆగస్టు 12, 13 తేదీల్లో గుడివాడ ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఆసక్తి గల క్రీడాకారులు నిర్ణీత తేదీల్లో సంబంధిత వేదికలకు హాజరై ఎంపికల్లో పాల్గొనాలని డీఎస్‌డీఓ కోరారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement