మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు
కోడూరు: ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఎండీ రాధా కృష్ణపై పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు డిమాండ్ చేశారు. కోడూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా రాధాకృష్ణ రాసిన రాతలు గర్హనీయమని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యాలను ప్రతి ఒకరూ తిప్పికొట్టాలన్నారు. తప్పుడు రాతలు రాసిన రాధా కృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మావిగన్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటాన్ని తట్టుకోలేక ఎల్లో మీడియా డైవర్షన్ రాజకీయా లకు తెరలేపిందని రమేష్‌బాబు దుయ్య బట్టారు. అసత్యాలు, అసభ్యకర కథనాలు ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళల గౌరవం, భద్రత కోసం వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తోందన్నారు. ఆ పార్టీ జిల్లా రైతు విభాగం కార్యదర్శి కొండవీటి వీర వెంకటనారాయణరావు, ఎంపీటీసీ బడే గంగాధరరావు, నేతలు పాల్గొన్నారు.


