పోక్సో కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు

Jan 9 2026 11:14 AM | Updated on Jan 9 2026 11:14 AM

పోక్స

పోక్సో కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు

177 మందికి జరిమానా

పక్కా ఆధారాల సేకరణ

నాలుగు కేసుల్లో నిందితులకు

20 ఏళ్ల జైలుశిక్ష

పక్కా ఆధారాలు సేకరించి

శిక్షలు పడేలా చర్యలు

డెప్యూటీ పోలీస్‌ కమిషనర్‌

కృష్ణకాంత్‌ పటేల్‌ వెల్లడి

లబ్బీపేట(విజయవాడతూర్పు): మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన 177 మందికి న్యాయస్థానం జరిమానాలు విధించింది. ఒకటి, ఆరో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో వారు పట్టు బడ్డారు. వారిని ఏడో అడిషనల్‌ జ్యూడిషల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పర్చగా న్యాయ మూర్తి ఆర్‌.వి.ఎస్‌.శర్మ ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు.

లైంగిక దాడి కేసుల్లో పోక్సో చట్టాన్ని అనుసరించి నేరాన్ని నిరూపించడానికి అవసరమైన సాంకేతిక, శాసీ్త్రయ ఆధారాలైన సీసీ కెమెరా పుటేజీ, సీడీఆర్‌ ఎనాలసిస్‌, ఎలక్ట్రా నిక్‌ గ్యాడ్జెట్స్‌ ఎనాలసిస్‌, ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టులను కోర్టుల్లో పక్కాగా సమర్పిస్తున్నట్లు డీసీపీ కృష్ణకాంత్‌ పటేల్‌ తెలిపారు. రేప్‌ కేసులకు సంబంధించిన బాధితుల మెడికల్‌ ఎగ్జామినేషన్‌, బాధిత బాలలు, నిందితులు నేర సమయంలో దరించిన దుస్తులను సకాలంలో ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపడం ద్వారా డీఎన్‌ఏ ఎనాలసిస్‌కు అందించడం, నిదితుడి ఆచూకీ నాట్‌ గ్రిడ్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సమర్థవంతమైన దర్యాప్తుతో శిక్షలు పడేలా చేస్తున్నామన్నారు. సమావేశంలో ఏడీసీపీ మురళీ కృష్ణ, ఏసీపీలు వై.డి.ప్రసాద్‌, లతాకుమారి, వాసవి తదితరులు పాల్గొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): బాలికలపై బలవంతంగా, వారి ఇష్టపూర్వకంగా అయినా లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని డెప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ కృష్ణకాంత్‌ పటేల్‌ పేర్కొన్నారు. అందుకు ఇటీవల నాలుగు కేసుల్లో నిందితులకు 20 ఏళ్లు చొప్పున జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పులే నిదర్శనమని తెలిపారు. ఆయా కేసుల్లో పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు దిశా నిర్దేశంలో పక్కా ఆధారాలు సేకరించడంతో నిందితులకు శిక్షలు పడినట్లు వివరించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్‌స్టేషన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసుల వివరాలు వెల్లడించారు.

కేసులు ఇవీ..

విజయవాడ భవానీపురం గాలిబ్‌షా దుర్గా ప్రాంతంలో నివశించే షేక్‌ ఖాసిమ్‌ (24) అదే ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలికపై లైంగికదాడి చేశాడు. ఈ ఘటనపై పోలీ సులు కేసు నమోదు చేశారు. మహిళా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి ఏసీపీగా ఉన్న కె.స్రవంతి దర్యాప్తు అధికారిగా వ్యవహరించగా, నేరస్తుడికి స్పెషల్‌ కోర్టు జడ్జి వేల్పుల భవానీ ఇటీవల 20 ఏళ్లు జైలుశిక్ష, రూ.10 వేల జరి మానా విధించారు.

మాచవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 16 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన మేడేపల్లి సాయికుమార్‌(24) ప్రేమపేరుతో మోస గించి, ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వాసవి దర్యాపు అధికారిగా వ్యవహరించగా నిందితుడికి 20 ఏళ్లు కఠినకారాగార శిక్ష విధిస్తూ ఇటీవల కోర్టు తీర్పు ఇచ్చింది.

విజయవాడ రూరల్‌ మండలం నున్న పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తొమ్మిదేళ్ల బాలికపై ఆమె తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న బెజవాడ రాంబాబు(35) లైంగికదాడి చేశాడు. ఆ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన మహిళా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి ఏసీపీ కె.స్రవంతి తగిన ఆధారాలు సమర్పించడంతో నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది.

విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఎనమిమిదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల రావూరి వెంకటేశ్వరరావు లైంగికదాడి చేశాడు. ఈ కేసును ఏసీపీ కె.స్రవంతి దర్యాప్తు చేసి తగిన ఆధారాలు సేకరించడంతో దోషికి 20 ఏళ్లజైలు శిక్ష పడింది. వీటిలో రెండు కేసులకు సంబంధించి ఏడాదిలోనే శిక్షలు పడటం గమనార్హం.

పోక్సో కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు 1
1/1

పోక్సో కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement