ఎట్టకేలకు.. | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు..

Jan 9 2026 7:37 AM | Updated on Jan 9 2026 7:37 AM

ఎట్టక

ఎట్టకేలకు..

వెస్ట్‌ బైపాస్‌కు వీడిన చిక్కుముడి..! నాడు వేగంగా పనులు రైతుల ముసుగులో అడ్డుకున్నారు చంద్రబాబు ప్రభుత్వంలో జాప్యం అసంపూర్తి పనులతో తిప్పలు..

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పనులు పూర్తి

అసంపూర్తిగా ఉన్న పనులను చేస్తున్న వైనం

చిన అవుటపల్లి వద్ద జాతీయ రహదారిని అనుసంధానించే పనులు

వెస్ట్‌ బైపాస్‌కు వీడిన చిక్కుముడి..!

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎట్టకేలకు వెస్ట్‌ బైపాస్‌ పనులకు సంబంధించి చిక్కుముడులు వీడుతున్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పనులు పూర్తయితే, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు సర్కార్‌లో కొందరు అధికార పార్టీ నేతలే పనులు ముందుకు సాగకుండా అడ్డుకోవడంతో మూడు చోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇప్పుడు వాటికి మోక్షం కలిగింది.

ప్యాకేజీ 3 కింద చిన అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల మేర వెస్ట్‌ బైపాస్‌ పనులకు ఫిబ్రవరి 2021లో శ్రీకారం చుట్టారు. పని విలువ రూ.1,148 కోట్లుగా నిర్ణయించారు. గత ప్రభుత్వ హయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు శరవేగంగా కదిలాయి. జనవరి 2024లో బైపాస్‌ను ప్రారంభించడానికి పనులను పరుగులు పెట్టించారు. 90 శాతం పైగా పనులు జరిగాయి. అయితే బైపాస్‌ రోడ్డును ప్రారంభిస్తే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని టీడీపీ నేతలు కుట్రలు పన్నారు.

రైతుల ముసుగులో కొంతమంది విద్యుత్‌ టవర్ల మార్పిడి ప్రాంతంలో పనులు పూర్తి కాకుండా అడ్డుకొన్నారు. మూడు చోట్ల మాత్రమే పనులు ఆగిపోయాయి. 90 మీటర్ల మేర జక్కంపూడి, నున్న ప్రాంతంలో విద్యుత్తు టవర్లు ఉన్న ప్రాంతంలో రోడ్డు పనులు ఆగిపోయాయి. రోడ్డు పనులు పూర్తి స్థాయిలో అయిన తర్వాతే ఇరువైపులా బైపాస్‌కు అనుసంధానం చేసే పనులు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చిన అవుటపల్లి, గొల్లపూడి వద్ద అనుసంధాన పనులు నిలిచిపోయాయి.

టీడీపీ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా మిగిలిన పనులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం చేసింది. విజయవాడ వాసుల ట్రాఫిక్‌ కష్టాలను దృష్టిలో ఉంచుకొని చివరకు తాత్కాలికంగా వాహన రాకపోకలను అనుమతించారు. ఈ నేపథ్యంలో చివరకు అధికారులు మిగిన పనులపై దృష్టి సారించారు. పూర్తి స్థాయిలో ఫిబ్రవరి చివరి నాటికి పనులు పూర్తి చేసి, వెస్ట్‌ బైపాస్‌ను అందుబాటులోకి తేవడానికి అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.

జక్కంపూడి– అంబాపురం మధ్య పాముల కాలువ వంతెన నిర్మాణం చేపట్టక పోవడంతో, ప్రస్తుతం వాహనాలు తాత్కాలిక మార్గంలో ఒకే వైపు రాకపోకలు సాగించాల్సింది. అక్కడ వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. హైదరా బాద్‌ నుంచి వచ్చే వారు గొల్లపూడి సమీపంలో బైపాస్‌లోకి ప్రవేశించే చోట, రహదారి పనులు ఇరుకుగా ఉండటంతో, వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. పశ్చిమ బైపాస్‌, ఎన్‌హెచ్‌–16 కలిసే చోట , అనుసంధాన పనులు పూర్తి కాక పోవటంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాఒటి ఆటంకాలను తొలగించాని పూర్తిస్థాయిలో వెస్ట్‌ బైపాస్‌ను అందుబాటులోకి తేవాల్సి ఉంది.

ఎట్టకేలకు.. 1
1/1

ఎట్టకేలకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement