ఆర్టీసీ ఉద్యోగులకు పీవీసీ గుర్తింపు కార్డులు
విజయవాడలీగల్: వుద్యం అక్రమ కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న జోగి రాము, జోగి రమేష్, దారబోయిన ప్రసాద్ తరఫున దాఖలైన బెయిల్ పిటీషన్లపై గురువారం విచారణ పూర్తయింది. ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి లెనిన్‌బాబు తీర్పును ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. సయ్యద్ హాజీ, కట్టా రాజు, మిథున్ దాస్, అంతాదాస్ తరఫున దాఖలైన బెయిల్ పిటీషన్లపై ప్రాసిక్యూషన్ కౌంటర్లు దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను ఈ నెల 12వ తేదీకి, షేక్ అల్లాభక్షు తరఫున దాఖ లైన బెయిల్ పిటీషన్‌పై కౌంటర్ దాఖలు చేయా లని ఆదేశిస్తూ ఈ నెల 19వ తేదీకి ఎకై ్సజ్ కోర్టు న్యాయూర్తి లెనిన్‌బాబు వాయిదా వేశారు. ఈ కేసులో జినేష్, షీబు నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఎకై ్సజ్ పోలీసులు ఎౖక్సైజ్ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటీషన్‌పై డిఫెన్స్ న్యాయవాదులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశిస్తూ కౌంటర్ నిమిత్తం ఈ నెల 12వ తేదీకి వాయిదా చేశారు. అద్దేపల్లి జనార్దనరావు, అద్దేపల్లి జగన్మోహనరావు, తలారి రంగయ్య, బాలాజీ, సుదర్శన్ తరఫున దాఖలైన బెయిల్ పిటీషన్లపై ప్రాసిక్యూషన్ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడంతో న్యాయ మూర్తి విచారణను వాయిదా వేశారు.


