పారిశుద్ధ్య పనులు సజావుగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య పనులు సజావుగా నిర్వహించాలి

Jan 9 2026 11:14 AM | Updated on Jan 9 2026 11:14 AM

పారిశుద్ధ్య పనులు  సజావుగా నిర్వహించాలి

పారిశుద్ధ్య పనులు సజావుగా నిర్వహించాలి

పారిశుద్ధ్య పనులు సజావుగా నిర్వహించాలి చిలకలపూడి(మచిలీపట్నం): పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు సజావుగా జరిగేలా చూడా లని మునిసిపల్‌ కమిషనర్లను కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ పర్యవేక్షణ సమావేశాన్ని మునిసిపల్‌ కమిషనర్లతో నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ.. మునిసిపల్‌ కమిషనర్లు నిత్యం తెల్ల వారుజామున పట్టణాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనుల నిర్వహణను గమనిస్తున్నారా, లేదా? అని అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో తడి చెత్త, పొడిచెత్తను వేర్వేరుగా సేకరించి, కంపోస్ట్‌ ఎరువు తయారు చేస్తున్నదీ, లేనిదీ పరిశీలించాలని ఆదేశించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో మొదటిదశలో ఒప్పందం ప్రకారం 65,861 టన్నుల లెగసీ వ్యర్థాలకు 61,107 టన్నులు వివిధ రకాలుగా వేరుచేసే ప్రక్రియ పూర్తయ్యిందని ప్రజారోగ్యశాఖ ఈఈ ప్రవీణ్‌ కలెక్టర్‌కు వివరించారు. గుడివాడ మునిసిపాలిటీలో 43,953 టన్నుల వ్యర్థాలకు 23,620 టన్నుల వ్యర్థాలను వివిధ రకాలుగా వేరు పరిచే ప్రక్రియ జరుగుతోందన్నారు. పెడన, ఉయ్యూరు పట్టణాల్లో ఇంకా మొదలు కాకపోవటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఏ మాత్రం ఆలస్యం చేయ కుండా వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. సమావేశంలో మునిసిపల్‌ కమిషనర్లు సీహెచ్‌ బాపిరాజు, మనోహర్‌, రామారావు, నజీర్‌ తదితరులు పాల్గొన్నారు. భార్య హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు ప్రయాణికులకు అసౌకర్యం కలిగించొద్దు

మునిసిపల్‌ కమిషనర్లకు

కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ ఆదేశం

పాయకాపురం(విజయవాడరూరల్‌): నున్న పోలీస్‌ స్టేషన్‌ పరిధి పాయకాపురం ప్రాతానికి చెందిన నిరజ హత్య కేసులో ఆమె భర్త వడ్డాది దుర్గారావు (39)కు మహిళా సెషన్స్‌ కోర్టు జడ్జి జి.రాజేశ్వరి జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చారు. 2020వ సంవత్సరం ఎల్‌బీఎస్‌ నగర్‌, పాయకాపురానికి చెందిన వడ్డాది దుర్గారావుకు నీరజను ఇచ్చి పెద్దల సమక్షంలో రెండో వివాహం చేశారు. దుర్గారావు చెడు వ్యసనాలకు బానిసై భార్యను సరిగా చూసుకోకుండా అనుమానిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలో 2021, మే ఐదో తేదీన నీరజను భర్త కత్తితో పొడిచి చంపేశాడు. అదే నెల ఏడో తేదీన నింది తుడిని అప్పటి సీఐ హనీష్‌బాబు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో మహిళా సెషన్స్‌ కోర్టు జడ్జి జి.రాజేశ్వరి జీవిత ఖైదు, జరిమానా విధించారు.

కంచికచర్ల: సంక్రాంతి పండుగ సందర్భంగా, సెలవుల నిమిత్తం హైదరాబాద్‌ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వచ్చే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని డీసీపీ బి. లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మండలంలోని కీసర టోల్‌ప్లాజా వద్ద డివిజన్‌ పోలీస్‌ అధికారులు, రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారులు, నేష నల్‌ హైవే అథారిటీ అధికారులు, టోల్‌ప్లాజా అధికారులతో గురువారం రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునే విధంగా భద్రతా చర్యలు తీసుకోవాల డీసీపీ సూచించారు. అనంతరం 47వ భద్రతా మాసో త్సవాలు కార్యక్రమంలో డీసీపీ లక్ష్మీనారాయణ పోలీస్‌ అధికారులతో కలసి పాల్గొన్నారు. వాహనదారులందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నందిగామ డివిజన్‌ ఏసీపీ తిలక్‌, నందిగామ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పూర్ణిమ, నందిగామ టౌన్‌, నందిగామ రూరల్‌ సీఐలు వై.వి.ఎల్‌.నాయుడు, డి.చవాన్‌, పలువురు ఎస్‌ఐలు, నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement