కత్తెర పురుగు జీవిత కాలం 60 రోజులు
కత్తెర పురుగు జీవిత కాలం 60 రోజుల వరకు ఉంటుంది. మొక్క జొన్న విత్తిన వారం నుంచి పది రోజుల తరువాత వచ్చే మొలకలను భూమిలో ఉండే తల్లిపురుగులు ఆశిస్తాయి. మొక్కలపై గుంపులుగా గుడ్లు పెడుతుంటాయి. గుడ్లు నుంచి బయటకు వచ్చిన పురుగులు మొక్క ఆకులను గోకి తింటాయి. దీంతో ఆకులపై నిలువుగా రంధ్రాలు ఏర్పడతాయి. పురుగులు పెద్దవి అయిన తరువాత మొవ్వులో చేరి లోపల కాండాన్ని తినేస్తాయి. మొవ్వను పూర్తిగా తినేయటం వల్ల మొవ్వు కత్తిరించినట్లుగా ఉంటుంది. పురుగు తిని విసర్జించిన మల పదార్థాలతో మొవ్వ నిండిపో తుంది. మొవ్వులో ఉన్న పూతకు కూడా నష్టం కలుగుతుంది. ఫలితంగా కండెలు తయారు కావు.
కొళ్లికూళ్లలో కత్తెర పురుగు ఆశించిన మొక్క


