ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మద్యానికి బానిసైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది.పోలీసుల కథనం మేరకు..చిట్టినగర్ వీరయ్య వీధికి చెందిన కర్రి రవి(28) తాపీ పనిచేస్తూ తల్లి నాగమణితో కలిసి నివాసం ఉంటున్నాడు. మద్యం తాగే అలవాటు ఉన్న రవి శనివారం సాయంత్రం ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు రవిని కిందకు దింపి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే రవి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


