జోగి సోదరుల బెయిల్ పిటీషన్
విజయవాడలీగల్: నకిలీ మద్యం కేసులో విజయవాడ జిల్లాజైలులో రిమాండ్‌లో ఉన్న జోగి రమేష్, జోగి రాము ఎకై ్సజ్ కోర్టులో మంగళవారం బెయిల్ పిటీషన్లు దాఖలు చేశారు. గతంలో వారు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో మరోసారి బెయిల్ కోరుతూ పిటీషన్లు దాఖలు చేశారు.
కంచికచర్ల: ఊకపొట్టును ట్రాక్టర్‌లో లోడు చేసి, ఆ వాహనంపై తిరుగు ప్రయాణమైన వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. ఎస్‌ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు.. నందిగామ శివారు అనాసాగరం గ్రామానికి చెందిన కె.నరసింహారావు(45) ట్రాక్టర్‌కు ఊకపొట్టు లోడ్ చేసేందుకు మండలంలోని కొత్తపేట గ్రామానికి వెళ్లాడు. లోడ్ చేసిన అనంతరం అదే ట్రాక్టర్‌పై డ్రైవర్ పక్కన కూర్చుని ఇంటికి వస్తుండగా పరిటాలలోని నక్కలంపేట సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనల నరసింహారావు తలకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని ట్రాక్టర్ డ్రైవర్ నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యం పొందుతుండగా పరిస్థితి విష మించి నరసింహారావు మృతి చెందాడు. మృతుడి కుమారుడు తిరుపతిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


